Thursday, July 22, 2021

తాండూర్ రోడ్డు తెలంగాణా లో అందరికి ఆదర్శం

హైదరాబాద్ : 22/07/2021

*lతెలంగాణ డైనమిక్ మంత్రివర్యులు గౌరవనీయులైన @KTRTRS సర్ గారరికి నమస్కారం 🙏.

సర్ మీ పర్యటనతోనైనా తాండూర్ నియోజకవర్గం ప్రజలు మిమ్మల్ని అభినందిస్తారు... ఎందుకంటే అక్కడి రవాణా సౌకర్యాలు చాలా ఘోరంగా వున్నాయి. రోడ్ల పరిస్థితి చెప్పనక్కరలేదు ఒక్కప్పటి రంగారెడ్డి జిల్లా ప్రస్తుతం వికారాబాద్ జిల్లాగా మారిన ప్రాంతంలో తాండూర్ అంటే దేశం మొత్తం గుర్తుపడతారు దాదాపు కారణం తాండూర్ కందిపప్పు & తాండూర్ బండలు(stones). అలాంటి ప్రాంతాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు ఎప్పటినుంచో (తెలంగాణ రాకముందు) నుంచి కూడా అభివృద్ధి చేయడంలో విఫలం అయ్యారు... కాదు కాదు నిర్లక్ష్యం చేశారు రాజకీయాల కోసం. అయితే తెలంగాణ వచ్చాక అయినా తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అని ప్రజలు నమ్మారు కానీ ఈరోజు వరకు కూడా ఎలాంటి మార్పు రాలేదు కారణం స్థానిక ప్రజాప్రతినిధులు. మీరు ఇప్పటికైనా ప్రజల మన్ననలు పొందాలంటే తక్షణమే మేధావి వర్గంతో చర్చించి అభివృద్ధికి మీరే స్వయంగా పునాది వేయాలి... ఒక్క తాండూర్ నియోజకవర్గం మొత్తం జిల్లాలోనే పేరొందిన ప్రాంతం కాబట్టి నిర్లక్ష్యం చేయకండి దీని ప్రభావం జిల్లా మొత్తం ఉంటుంది. నాకు దాదాపు ఈ ప్రాంతంతో 20 సంవత్సరాలుగా అనుబంధం వుంది రాజకీయంగా కాదు సామాజిక కార్యకర్తగా.... Bplkm*  

https://youtu.be/hp2Qhnbh_Hw

Bapatla Krishnamohan
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (Twitter)
prj_snklpm9456 (Instagram)
https://youtube.com/channel/UCO3m8P1ULX6soj73A43nhMg   (youTube)

కూ యాప్‌లో @praja_snklpm యొక్క ఆసక్తికరమైన ఆలోచనలను వినండి - https://www.kooapp.com/profile/praja_snklpm

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment