హైదరాబాద్ : 11/07/2021
ఓవైపు వరద.. మరోవైపు వృత్తిధర్మం! నీటి ప్రవాహాన్ని దాటుకుని టీకాలు వేసిన సిబ్బంది
ఎదుటివారికి సహాయం అందించడం కోసం హెల్త్ వర్కర్లు ఎంతకైనా తెగిస్తారు. కొన్ని సందర్భాలలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు సాయపడిన హెల్త్ వర్కర్లను చూశాం. ఇంటింటికి కోవిడ్ వ్యాక్సిన్ వేసే క్రమంలో అలాంటి సాహసమే చేశారు జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు హెల్త్ వర్కర్లు.
రాజౌరి జిల్లా ట్రల్లా గ్రామంలో వ్యాక్సిన్ వేయడానికి వచ్చిన హెల్త్ వర్కర్లు ఒక నదిని దాటాల్సి వచ్చింది. కానీ వరదల కారణంగా ఆ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆ నది దాటితేనే గ్రామంలోకి వెళ్లి అక్కడి ప్రజలకు వ్యాక్సిన్ వేయవచ్చు. దీంతో తమ విధిని నిర్వర్తించడం కోసం పెద్ద సాహసమే చేశారు. ఉధృతంగా ప్రవహిస్తున్న ఆ నదిని చాలా కష్టంగా దాటుకుంటూ వెళ్లారు. ట్రల్లా గ్రామస్థులకు టీకాలు వేశారు. ట్రల్లా గ్రామంలోని ఆరోగ్య కేంద్రంలో పనిచేసే ఒక డాక్టర్ ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆరోగ్య కార్యకర్తలు చేసిన ఈ సాహాసానికి సంబంధించిన వీడియోను ప్రముఖ వార్తాసంస్థ ఏఎన్ఐ తమ ట్విటర్‌లో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది
No comments:
Post a Comment