Saturday, July 31, 2021

క‌రోనా కేసుల‌పై తెలంగాణ స‌ర్కార్ హెచ్చ‌రిక‌

హైదరాబాద్ : 30/07/2021

క‌రోనా కేసుల‌పై తెలంగాణ స‌ర్కార్ హెచ్చ‌రిక‌

తొలివెలుగు మీడియా ట్విట్టర్ సౌజన్యంతో 

దేశంలో క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరుగుతున్న వేళ తెలంగాణ స‌ర్కార్ కీల‌క హెచ్చ‌రిక చేసింది. ఇప్ప‌టికైతే తెలంగాణ రాష్ట్రంలో కరోనా పూర్తిగా అదుపులో ఉందన్న ప్ర‌జారోగ్య సంచాల‌కులు శ్రీనివాసరావు, డెల్టా వేరియెంట్ మన దేశంతో పాటు 130దేశాల్లో చాలా ఇబ్బందులు పెడుతుంద‌న్నారు.

మనకు ఆనుకొని ఉన్న రాష్ట్రాల్లో కూడా కేసులు పెరుగుతున్నాయని ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని కోరారు. కేరళలో దేశంలో నమోదు అయ్యే కేసుల్లో 50శాతం అక్కడే నమోదు అవుతున్నాయన్న ఆయ‌న‌, వాక్సినేషన్ ఎక్కువగా జరిగిన దేశాల్లో కూడా కేసులు నమోదు అవుతున్నాయన్నారు. అయితే… వైర‌స్ తీవ్ర‌త త‌క్కువ‌గా ఉంటుంద‌ని తెలిపారు.

డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు రెండు దాదాపుగా ఒక్కటే లాగా ఉన్నాయన్నారు. ప్రమాదకరమైనవి ఏమి కావ‌ని, భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని చెప్పారు. అయితే నిర్లక్ష్యంగా ఉంటే మొద‌టికే మోసం వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు. తెలంగాణ‌లోని కొన్ని జిల్లాల్లో కేసులు విపరీతంగా నమోదు అవుతున్నాయ‌ని, నిబంధనలు పాటించకపోతే ఔట్ బ్రేక్ అవుతున్నాయని చెప్పారు. ఖమ్మం కూసుమంచి ఘ‌ట‌నే ఇందుక నిద‌ర్శ‌న‌మ‌న్నారు.

స్వీయ నియంత్ర‌ణ లేక‌పోతే కేర‌ళ లాగే ఇక్క‌డ కూడా కేసులు పెరిగే ప్ర‌మాదం ఉంద‌న్నారు.

No comments:

Post a Comment