హైదరాబాద్ : 23/07/2021
*లంచాలతో ఉద్యోగాలకు ప్రయత్నిస్తే కఠినచర్యలు....!*
హైదరాబాద్: ఉద్యోగాల పేరుతో కొంత మంది మోసాలకు పాల్పడుతున్నారని.. అలాంటివాటికి నిరుద్యోగులు మోసపోవద్దని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) కార్యదర్శి వాణీ ప్రసాద్ సూచించారు. టీఎస్‌పీఎస్‌సీ ద్వారా ఉద్యోగ నియామక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతున్నట్లు చెప్పారు. మోసం చేసిన వారితో పాటు లంచాలతో ఉద్యోగం పొందాలని ప్రయత్నించే అభ్యర్థులపైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాకుండా భవిష్యత్తులో దేశవ్యాప్తంగా సర్వీస్ కమిషన్ల పరీక్షలు రాయకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఉద్యోగాల పేరిట మోసాలకు పాల్పడే వారి వివరాలు, ఇతరత్రా ఫిర్యాదులను vigilance@tspsc.gov.in కి మెయిల్ చేయాలని ఆమె సూచించారు.మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని వాణీ ప్రసాద్ స్పష్టం చేశారు.
*link Media ప్రజల పక్షం*
prajasankalpam1.blogspot.com
No comments:
Post a Comment