Tuesday, July 13, 2021

హైదరాబాదీకి 2 కోట్ల ఫెలోషిప్‌

హైదరాబాద్ : 14/07/2021

హైదరాబాదీకి 2 కోట్ల ఫెలోషిప్‌

నమస్తే తెలంగాణ మీడియా ట్విట్టర్ సౌజన్యంతో 
హైదరాబాదీకి 2 కోట్ల ఫెలోషిప్‌
  • ప్రపంచవ్యాప్తంగా ఆరుగురు ఎంపిక

హైదరాబాద్‌ సిటీబ్యూరో, జూలై 13 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌కు చెందిన టీ శ్వేతారె డ్డి(17) ప్రపంచ ప్రఖ్యాత రూ.2 కోట్ల డయర్‌ (డిజైనింగ్‌ యువర్‌ ఆంత్రప్రెన్యూరియల్‌ రోడ్‌ మ్యాప్‌) ఫెలోషిప్‌నకు ఎంపికైంది. అమెరికాలోని ప్రముఖ 25 కాలేజీల్లో ఒకటైన లాఫాయెట్‌లో అడుగుపెట్టబోతున్నది. ఆమెతోపాటు ఈ ఫెలోషిప్‌నకు ఆరుగురే ఎంపికయ్యారు. లాఫాయెట్‌ కాలేజీ లో ఈమె బీఎస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ చదువబోతున్నది. పాఠశాల స్థాయిలో కనబర్చిన ప్రతిభ, నాయకత్వ లక్షణాలు, వలంటీర్‌ సేవలు, ఆసక్తి, గతంలో ఎదురైన అవరోధాలు, వాటిని ఎదుర్కొన్న తీరుపై స్వీయ అనుభవాలతో సమాధానాలు రాసి పంపించాల్సి ఉంటుంది. వాటన్నింటికి శ్వేతారెడ్డి తనదైన శైలిలో సమాధానలిచ్చింది. వాటిని పరిశీలించిన యాజమాన్యం డయర్‌ ఫెలోషిప్‌నకు ఎంపికచేసింది.

No comments:

Post a Comment