Friday, July 16, 2021

జూనియర్‌ కాలేజీలుగా 119 గురుకులాలు

హైదరాబాద్ : 17/07/2021

జూనియర్‌ కాలేజీలుగా 119 గురుకులాలు

నమస్తే తెలంగాణ మీడియా ట్విట్టర్ సౌజన్యంతో 
జూనియర్‌ కాలేజీలుగా 119 గురుకులాలు
  • బీసీ గురుకులాలన్నింటికీ పక్కా భవనాలు: గంగుల

హైదరాబాద్‌, జూలై 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఈ ఏడాది 119 గురుకుల పాఠశాలలను జూనియర్‌ కాలేజీలుగా అప్‌గ్రేడ్‌ చేయనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ వెల్లడించారు. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని స్వరాష్ట్రంలో ప్రభుత్వ విద్యాసంస్థలు కార్పొరేట్‌ సంస్థలను మైమరిపిస్తున్నాయని తెలిపారు. బీసీ గురుకులాలపై శుక్రవారం జరిపిన సమీక్షలో మంత్రి గంగుల మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 261 పాఠశాలలు, 19 జూనియర్‌ కాలేజీలు, ఒక డిగ్రీ కాలేజీ సహా మెత్తం 281 గురుకులాల్లో ప్రభుత్వం సకల సౌకర్యాలను కల్పించిందన్నారు. అన్ని బీసీ గురుకులాలు నూటికి నూరుశాతం డిజిటలైజ్‌ అయ్యాయని, వాటిలో విద్యా ప్రమాణాలను పెంచడంతో క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్లు జోరందుకున్నాయని చెప్పారు.

ప్రతిష్ఠాత్మకంగా కమలాపూర్‌ గురుకులం

కమలాపూర్‌ గురుకులం కార్పొరేట్‌కు దీటుగా నిలిచిందని మంత్రి గంగుల అభినందించారు. రూ.20 కోట్లతో 15 ఎకరాల సువిశాల స్థలంలో 1.10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ గురుకులాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారని హర్షం వ్యక్తం చేశారు. విశాలమైన ఆటస్థలంతోపాటు పాఠశాల భవనాలు, సిబ్బంది క్వార్టర్లు, డైనింగ్‌ ఏరియా, లైబ్రరీ, ల్యాబొరేటరీని అద్భుతంగా తీర్చిదిద్దిన అధికారులను అభినందించారు. రాష్ట్రంలో ఇలాంటి గురుకులాలు మరో 25 ఉన్నాయని తెలిపారు. తెలంగాణ గురుకుల విద్యావ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. బీసీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం, మహాత్మాజ్యోతిబాపూలే గురుకుల విద్యాలయాల కార్యదర్శి మల్లయ్య బట్టు తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

No comments:

Post a Comment