Friday, July 9, 2021

ఐపీఎస్‌ ఆఫీస‌ర్‌పై దేశ‌ద్రోహం కేసు..

హైదరాబాద్ : 10/07/2021

ఐపీఎస్‌ ఆఫీస‌ర్‌పై దేశ‌ద్రోహం కేసు..

నమస్తే తెలంగాణ మీడియా ట్విట్టర్ సౌజన్యంతో 
ఐపీఎస్‌ ఆఫీస‌ర్‌పై దేశ‌ద్రోహం కేసు..

రాయ్‌పూర్: ఐపీఎస్ ఆఫీస‌ర్ జీపీ సింగ్‌పై చ‌త్తీస్‌ఘ‌డ్ పోలీసులు దేశ‌ద్రోహం కేసు న‌మోదు చేశారు. అక్ర‌మాస్తుల కేసులో ఐపీఎస్ ఆఫీస‌ర్ గ‌త వార‌మే స‌స్పెష‌న్‌కు గుర‌య్యాడు. ఏసీబీ, ఎక‌నామిక్ అఫెన్సెస్ వింగ్ చేసిన దాడుల్లో.. జీపీ సింగ్ వ‌ద్ద ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్న‌ట్లు తేలింది. సోదాలు నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో దొరికిన కొన్ని కాగితాల ఆధారంగా అత‌నిపై దేశ‌ద్రోహం కేసు బుక్ చేశారు. రెండు వ‌ర్గాల మ‌ధ్య శ‌త్రుత్వాన్ని పెంచేందుకు ప్ర‌య‌త్నించాడ‌ని, ప్ర‌జానేత‌లు, ప్ర‌భుత్వం ప‌ట్ల కుట్ర ప‌న్నిన‌ట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఐపీసీ సెక్ష‌న్ 124-ఏ, 153-ఏ ప్ర‌కారం ఐపీఎస్ జీపి సింగ్ పై కేసులు న‌మోదు చేశారు. రాయ్‌పూర్‌లోని కొత్వాలి పోలీసు స్టేష‌న్‌లో ఆ కేసు ఫైల్ చేశారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన ద‌ర్యాప్తు కొన‌సాగుతున్న‌ట్లు అధికారులు చెప్పారు. మూడు రోజుల పాటు ఇటీవ‌ల ఏసీబీ, ఈఓడ‌బ్ల్యూలు సుమారు 15 చోట్ల సోదాలు నిర్వ‌హించాయి. ఆఫీస‌ర్ వ‌ద్ద సుమారు ప‌ది కోట్ల ఆస్తులు ఉన్న‌ట్లు గుర్తించారు.

1994 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ జీపీ సింగ్‌.. గ‌తంలో ఏసీబీలో అడిష‌న‌ల్ డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్‌గా చేశారు. జీపీ సింగ్ సింగ్ ఇంట్లో కొన్ని చింపేసిన కాగితాలు దొరికాయ‌ని, వాటిని ప‌రిశీలిస్తే.. ఏదో కుట్ర ప‌న్నిన‌ట్లు అర్థ‌మైంద‌ని పోలీసులు చెప్పారు. కుల‌, మ‌త‌, జాతి, వివ‌క్ష ఆధారంగా శత్రుత్వం పెంచే రీతిలో అత‌ని వ‌ద్ద స‌మాచారం ఉన్న‌ట్లు గుర్తించామ‌న్నారు.

No comments:

Post a Comment