Thursday, July 22, 2021

పార్ల‌మెంట్ లో ఏపీ-తెలంగాణ‌ల నీళ్ల పంచాయితీ

హైదరాబాద్ : 22/07/2021

పార్ల‌మెంట్ లో ఏపీ-తెలంగాణ‌ల నీళ్ల పంచాయితీ

తొలివెలుగు మీడియా ట్విట్టర్ సౌజన్యంతో 

ఏపీ, తెలంగాణ‌ల మ‌ధ్య న‌డుస్తున్న కృష్ణాన‌ది జలాల పంప‌కం పార్ల‌మెంట్ ను తాకింది. కృష్ణాన‌ది జ‌లాల‌పై వివాదం లోక్‌స‌భ‌లో చ‌ర్చ‌కు వ‌చ్చింది. శ్రీశైలం జ‌లాశ‌యం నుంచి అక్ర‌మంగా తెలంగాణ జెన్‌కో విద్యుత్ ఉత్ప‌త్తి చేస్తుంద‌ని, శ్రీశైలం ప్రాజెక్టులో క‌నీసం 854 అడుగుల నీరుండాల‌ని, కానీ 800 అడుగుల ఎత్తులో ఉన్న‌ప్పుడు కూడా తెలంగాణ విద్యుత్తు ఉత్ప‌త్తి చేస్తోందని ఆరోపించారు ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపించారు. విద్యుత్ ఉత్ప‌త్తి ఆపాల‌ని కేంద్రం ఆదేశాలు ఇచ్చినా విద్యుత్తు ఉత్ప‌త్తి జ‌రుగుతోందన్నారు. దీని వ‌ల్ల రాయ‌ల‌సీమ‌కు నీటి క‌ష్టాలు వ‌స్తాయ‌న్నారు. ఏపీ, చెన్నై ప్ర‌జ‌ల సంక్షేమం కోసం విద్యుత్తును ఆపాల‌న్నారు.


దీనికి కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్ స్పందించారు. జెన్‌కోను విద్యుత్తు ఉత్ప‌త్తి ఆపాల‌ని కోరామ‌ని కానీ వారు విన‌లేద‌న్నారు. మ‌రోసారి వారికి లేఖ రాస్తామ‌ని తెలిపారు. ఇక పాల‌మూరు లిఫ్ట్ ఇరిగేష‌న్ స్కీమ్‌కు ఎన్విరాన్‌మెంట్ క్లియ‌రెన్స్ లేద‌ని ఎంపీ అవినాష్ రెడ్డి స‌భ‌లో ప్ర‌స్తావించారు. ఈ లిఫ్ట్ ఇరిగేష‌న్ డ్యామ్‌తో తెలంగాణ ప్ర‌భుత్వం 8 టీఎంసీల‌ నీటిని ప్ర‌తి రోజు వాడుకుంటుంద‌ని ఆరోపించారు. పాల‌మూరు వ‌ల్ల ఏపీ, చెన్నైకి తాగునీటికి క‌ష్టాలు ఏర్ప‌డుతాయ‌న్నారు. కేంద్ర ప్ర‌భుత్వం క‌ఠిన నిర్ణ‌యం తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.

దీనిపై కృష్ణా, గోదావ‌రి బోర్డుల‌కు లేఖ రాశామ‌న్న కేంద్ర‌మంత్రి షెకావ‌త్… నోటీసులు ఇచ్చామ‌న్నారు. త్వ‌ర‌లోనే బోర్డుల‌ను శ‌క్తి పెరుగుతుంద‌ని, ఇలాంటివి జ‌ర‌గ‌కుండా చూస్తామ‌ని హామీ ఇచ్చారు.

No comments:

Post a Comment