Thursday, July 29, 2021

పరిశుభ్రతకు పోలీసుల ‘5ఎస్‌’ డీజేపీ మహేందర్ రెడ్డి ఆదేశాలు


హైదరాబాద్ : 29/07/2021

పరిశుభ్రతకు పోలీసుల ‘5ఎస్‌’

నమస్తే తెలంగాణ మీడియా ట్విట్టర్ సౌజన్యంతో 
పరిశుభ్రతకు పోలీసుల ‘5ఎస్‌'
  • అన్ని పోలీస్‌ స్టేషన్లలో అమలు
  • డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశాలు

హైదరాబాద్‌, జులై 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అన్ని పోలీస్‌ స్టేషన్లు, పోలీస్‌ కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచేందుకు 5ఎస్‌ (సార్ట్‌, సెట్‌ ఇన్‌ ఆర్డర్‌, షైన్‌, స్టాండైర్టెజ్‌, సస్టేన్‌) విధానాన్ని అమలు చేస్టున్నట్టు డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి తెలిపారు. 5ఎస్‌ అమలు, పోలీస్‌ స్టేషన్లలో వ్యర్థాల తొలగింపు, పోలీసులకు కిట్ల పంపిణీకి రూపొందించిన వెబ్‌ అప్లికేషన్‌ నిర్వహణ తదితర అంశాలపై బుధవారం డీజీపీ సమావేశం నిర్వహించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అమలులో భాగంగా పోలీస్‌ స్టేషన్లు, కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచాలని, ఉత్తమ సేవలు అందించే వాతావరణాన్ని నెలకొల్పాలని ఆదేశించారు. ఇప్పటికే అమలవుతున్న 5ఎస్‌ విధానాన్ని మరింత పకడ్బందీగా కొనసాగించాలని స్పష్టం చేశారు. గత 15 ఏండ్లుగా వృథాగా ఉన్న పాత, వ్యర్థ పరికరాలను నిబంధనల మేరకు వేలం(ఆక్షన్‌)వేయాలని సూచించారు. ఇప్పటికే 29 పోలీసు యూనిట్లలో వేలం వేయగా వచ్చిన రూ.50,35,000 ప్రభుత్వ ఖజానాలో జమ చేసినట్టు తెలిపారు. పోలీసు సిబ్బందికి రెయిన్‌ కోట్‌, గ్రౌండ్‌ షీట్లు, ఉలెన్‌ బ్లాంకెట్లు, స్వెటర్స్‌ తదితర వస్తువులు కలిగిన కిట్లను సకాలంలో అందజేసేందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందించామని డీజీపీ వెల్లడించారు. కిట్ల పంపిణీలో సమర్థంగా వ్యవహరిస్తున్న లాజిస్టిక్స్‌ విభాగం ఐజీ సంజయ్‌ జైన్‌, స్టోర్స్‌ డీఎస్పీ వేణుగోపాల్‌ను ఆయన అభినందించారు. పోలీసు కార్యాలయాల నిర్వహణపై ప్రత్యేకశ్రద్ధ చూపించిన పలు జిల్లాల ఆర్‌ఐలకు డీజీపీ ప్రశంసాపత్రాలు అందజేశారు. సమావేశంలో తొమ్మిది పోలీస్‌ కమిషనరేట్లు, 20 జిల్లాల ఎస్పీ కార్యాలయాల రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

పోలీస్‌ పిల్లల విదేశీ విద్యకు 30 లక్షలు

రాష్ట్రంలో విధులు నిర్వర్తిస్తున్న పోలీస్‌ సిబ్బంది పిల్లల విదేశీ చదువులకు మరింత ప్రోత్సాహాన్ని అందించాలని డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి నిర్ణయించారు. విద్య కోసం విదేశాలకు వెళ్లే పోలీసుల పిల్లలకు పోలీస్‌ భద్రత నిధి నుంచి చెల్లించే ట్యూషన్‌ ఫీజును రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచాలని ఆయన నిర్ణయించారు. దీనికి అదనంగా ఇతర ఖర్చుల కోసం మరో రూ.30 లక్షలు వినియోగించుకునేలా వెసులుబాటు కల్పించారు. ఈ మేరకు వెల్ఫేర్‌ అడిషనల్‌ డీజీ ఉమేశ్‌ ష్రాఫ్‌ బుధవారం ఆదేశాలు జారీచేశారు. దీంతో డీజీపీ మహేందర్‌రెడ్డితోపాటు ఉమేశ్‌ ష్రాఫ్‌కు తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ అధికారుల సంఘం చైర్మన్‌ గోపిరెడ్డి ఓ ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు.

No comments:

Post a Comment