హైదరాబాద్ : 01/07/2021
*యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు :*
*తెలంగాణ డైనమిక్ మంత్రివర్యులు @KTRTRS సర్ గారికి నమస్కారం 🙏*
యాదాద్రి భువగిరి జిల్లా ఆలేరు మండలం గొలనుకొండ గ్రామంలో దళిత కులానికి చెందిన తమను దళిత కులానికి చెందిన కుల పెద్దలు సర్పంచ్ భర్త మరియు ఎంపీటీసీ భర్త కుల బహిష్కరణ చేశారని గ్రామానికి చెందిన బోడ.హనుమంతు కుటుంబం ఆరోపిస్తుంది... 20 వేల రూపాయలు కులంలో కడితేనే కులంలో కి పిలుస్తామని కుల పెద్దలు హెచ్చరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు....ఈ ఘటనపై కొన్ని రోజుల క్రితం పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోక పోవడంతో మానవ హక్కుల కమిషన్ కు పిటిషన్ ఇచ్చి మీడియా ముందుకు వచ్చామని తెలుపుతున్నారు...
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం గొలనుకొండ గ్రామం లో కుల బహిష్కరణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది...దళిత కులానికి చెందిన తమను సర్పంచ్ భర్త మరియు ఎంపీటీసీ భర్త కుల బహిష్కరణ చేసారంటూ ఆవేదన వ్యక్తంచేశారు గ్రామానికి చెందిన బోడ హనుమంతు కుటుంబ సభ్యులు.. తమను అనేక రకాల వేధింపులకు గురి చేస్తున్నారన్నారు....తమ కుటుంబానికి గత 20 సంవత్సరాల క్రితం అప్పుడు వున్న ప్రభుత్వం దళితులకు బలహీన వర్గాలకు స్థలాలు కేటాయించి పట్టా ఇచ్చారని తెలుపుతున్నారు...అప్పటినుండి అక్కడ నీళ్లు మరియు ఎలాంటి సౌకర్యాలు లేనందున అక్కడ వెళ్ళలేదు అన్నారు....ఈ మధ్యనే ప్రభుత్వ అధికారులతో చర్చించుకుని
అక్కడ నివసించడానికి ఇండ్లు నిర్మించుకున్న సమయంలో తాము ఇల్లు నిర్మించడానికి ప్రయత్నిస్తుండగా కుల పెద్దలు అయిన
గ్రామ సర్పంచ్ భర్త మరియు గ్రామ ఎంపీటీసీ భర్త
సింగిల్ విండో బ్యాంక్ చైర్మన్ కలిసి మమ్ములను సంప్రదించకుండా ఆ స్థలం లోకి ఎందుకు వెళ్ళావ్ అని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు... మమ్ములను సంప్రదించిన తర్వాతనే మీరు ఆ స్థలం లోకి వెళ్లాలని హెచ్చరించారు అని బోడ హనుమంతు కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు...
మాకు ప్రభుత్వం కేటాయించిన స్థలంలో నేను వెళ్లడానికి మిమ్ములను ఎందుకు సంప్రదించాలి అని ప్రశ్నించగా నాపై నా కుటుంబం పైన కుల బహిష్కరణ చేశారు అని తెలుపుతున్నారు...కులంలో మగవాళ్ళు మాత్రమే మాట్లాడాలని మహిళ ఎందుకు మాట్లాడుతుందని తమ కుటుంబాన్ని చెందిన మహిళ పై కుల పెద్దలు దౌర్జనానికి దిగుతున్నారని బోడ.హనుమంతు తెలుపుతున్నారు... 20 వేల రూపాయలు జరిమానా కడితేనే కులంలో నిన్ను రాణిస్తారు అని చెప్పిన కుల పెద్దలు గ్రామ సర్పంచ్ భర్త అంటున్నారన్నారు...మా దగ్గర 20 వేల రూపాయలు డబ్బులు లేవని మేము అంత డబ్బు కట్టలేమని అంటున్నారు....కులం లో ఉన్న పెద్ద మనుషుల కాళ్లు పట్టుకున్న కానీ కుల పెద్దలు గ్రామ సర్పంచ్ భర్త కలిసి ఆరు నెలలుగా మా కుటుంబాన్ని కుల బహిష్కరణ చేశారని మాకు న్యాయం చేయాలని ఎమ్మార్వో కు వినతి పత్రం ఇచ్చామని పోలీస్ స్టేషన్ లో పిటిషన్ ఇచ్చినాము పోలీసులు కేసు నమోదు విచారణ చేపడతామని పోలీసులు చెబుతున్నారన్నారు...గతంలో
పోలీస్ స్టేషన్ లో పిటిషన్ ఇచ్చిన పట్టించుకోక పోవడంతో మానవ హక్కుల కమిషన్ కు పిటిషన్ ఇచ్చాము అన్నారు... మాకు న్యాయం జరిగేలా చూడాలని బొడ హనుమంతు కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు...
ఈ విషయమై సర్పంచ్ భర్త కుల పెద్దలను వివరణ కోరగా 20000 రూపాయలు గ్రామ అభివృద్ధికి గ్రామంలో ఉన్న గుడి కి ఖర్చు చేస్తున్నామని వివరణ ఇచ్చారు....గ్రామంలో ఎవరు చనిపోయిన డప్పులు కొట్టదని దళితులు డప్పులు కొట్టవద్దని అంబేద్కర్ దళితులకు డప్పు కొట్టమని చెప్పలేదని దుష్ప్రచారం చేస్తున్నారని కుల పెద్దలు తెలుపుతున్నారు.....మేము వారి కుటుంబాన్ని కుల బహిష్కరణ చేసినట్టు ఎవరికి చెప్పలేదు అని కులపెద్దలు తెలుపుతున్నారు.... గ్రామంలో దళితులు డప్పు కొట్టవద్దు అన్నందుకే వారిని తమ వద్దకు రావొద్దు అని చెప్పాము అన్నారు.
*link Media సౌజన్యంతో*
*Note : తెరాస సర్పంచ్ ఎంపీటీసీ. సింగిల్ విండో డైరెక్టర్ నిర్వాకం*
Bapatla Krishnamohan
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (Twitter)
prj_snklpm9456 (Instagram)
https://youtube.com/channel/UCO3m8P1ULX6soj73A43nhMg (youTube)
https://prajasankalpam1.blogspot.com/
No comments:
Post a Comment