Sunday, July 25, 2021

గంజాయి(డ్రగ్స్) అరికట్టడం.... Bplkm

హైదరాబాద్ : 25/07/2021

            *గంజాయి(డ్రగ్స్) అరికట్టడం*

అందరికి నమస్కారం 🙏Bplkm.

ప్రస్తుతం గంజాయి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం చాలా వుంది. ఎందుకంటే దేశంలో పెద్ద పెద్ద పట్టణాలలో గంజాయి విక్రయాలు జరుగుతుండడం వాటిని యువత వాడడం మనము ఎప్పటినుంచో చూస్తూ వున్నాము వివిధ మాధ్యమాల ద్వారా. దానికి బానిసలుగా మారి ఎందరో జీవితాలను నాశనం చేసుకున్నారు కూడా.యువత గంజాయి తీసుకుంటుంది అని వాస్తవాలతో వార్త కథనాలలో వచ్చినా రాజకీయ నాయకులు స్పందించరు అలాగే ఈ అంశం మీద ఏ ఒక్క రాజకీయ పార్టీ కాని, నాయకులు కానీ మాట్లాడరు ఎందుకో??. డ్రగ్స్ ఒక్కప్పుడు ధనవంతుల పిల్లలు తీసుకునేవారు... ప్రస్తుతం మధ్యతరగతి, పేద వారికి కూడా అందుబాటులో ఉండేలా చేసాయి డ్రగ్స్ మాఫియా.
వీటిని అరికట్టాల్సిన పోలీస్ శాఖ మీద ఎన్నో ఒత్తుడులు అందరికి తెలిసిందే. మరి ఎలా పరిష్కారం చేయాలి అని ఎవరైనా ఆలోచిస్తున్నారా అంటే అదీ లేదు. ప్రతి రోజూ వార్తా కథనలలో చూస్తున్నాము రెండు తెలుగు రాష్ట్రాలలో గంజాయి ఎంతగా పట్టుబడుతుంది పోలీస్ శాఖ వారిచే. మరి ఇది ఎక్కడి నుంచి వస్తుంది దీనిని ఎలా అరికట్టాలి అని పోలీస్ ఉన్నతాదికారులు అయినా ప్రభుత్వాలు అయినా ఏమైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాయా అంటే ఏమి లేదు అని తెలిసిపోతుంది. కావున సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్ కు వ్యతిరేకంగా మీ గళం విప్పండి లేకపోతే మీ కుటుంబంలోని సభ్యులకు అలవాటు అయ్యేదాకా మౌనంగా వుంటే మీకే నష్టం.

Note :ఇక్కడ ఒక్క విషయం మాత్రం నేను ఖచ్చితంగా చెప్పదల్చుకున్నాను అది ఏమిటి అంటే వార్తా కథనాలలో డ్రగ్స్ పట్టుకున్నారు అని వాస్తవ కథనాలు వచ్చినప్పుడు ఏ ఒక్క రాజకీయ పార్టీ నాయకులు స్పందించలేదు. అంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితులు రాజకీయ పార్టీ లలో ఉన్నాయో అర్థం అవుతుంది. ధర్నాలు ముట్టడీలు చేసే రాజకీయ పార్టీ నాయకులారా డ్రగ్స్ గంజాయిని అరికట్టడంలో ముందుకు రావాలి అలాగే పోలీస్ శాఖ లో అవినీతికి ఆమడ దూరంలో వున్న అధికారులకు మరియు సోషల్ మీడియా ద్వారా మీకు తెలిసిన డ్రగ్స్ విక్రయాల సమాచారం ఇవ్వండి అని ప్రజా సంకల్పం & link Media ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము.

యువతను జాగృతం చేసే రాజకీయాలు ప్రస్తుతం లేవు అని నేను చెప్పదలచుకున్నాను.అందుకే యువత రాజకీయాలకు దూరం అవుతుంది. ఇది భవిష్యత్తులో పెద్ద ప్రభావం చూపుతుంది.

Copy to Group link Media

Bapatla Krishnamohan
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (Twitter)
prj_snklpm9456 (Instagram)
https://youtube.com/channel/UCO3m8P1ULX6soj73A43nhMg   (youTube)

కూ యాప్‌లో @praja_snklpm యొక్క ఆసక్తికరమైన ఆలోచనలను వినండి - https://www.kooapp.com/profile/praja_snklpm

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment