Monday, June 14, 2021

పొంగిన నాలా.. కాంట్రాక్టర్ కు మురికినీటి శిక్ష..!

హైదరాబాద్ : 14/06/2021

పొంగిన నాలా.. కాంట్రాక్టర్ కు మురికినీటి శిక్ష..!

తొలివెలుగు మీడియా సౌజన్యంతో (ట్విట్టర్)
పొంగిన నాలా.. కాంట్రాక్టర్ కు మురికినీటి శిక్ష..!

రుతుపవనాల ప్రభావంతో ముంబైలో భారీ వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. అక్కడక్కడా డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో నార్త్ ముంబైలో పర్యటించారు ఎమ్మెల్యే దిలీప్ పాండే. అయితే ఓ నాలా దగ్గర చెత్త పేరుకుపోవడాన్ని గమనించారు. దీంతో ఆయన ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

కాంట్రాక్టర్ కు కబురు పెట్టారు. ఎమ్మెల్యే పిలిచాడని మంచిగా టక్ చేసుకుని వచ్చాడు కాంట్రాక్టర్. రోడ్డుపై పారుతున్న మురుగు నీటిని చూపించి అందులో కూర్చోమన్నారు ఎమ్మెల్యే. షాకైన అతను చేద్దామా.. వద్దా..? అని ఆలోచిస్తుండగా ఓ వ్యక్తి వచ్చి అందులోకి తోశాడు. మురుగు నీటిలో కూర్చున్న కాంట్రాక్టర్ తలపై కార్మికులతో చెత్త వేయించారు దిలీప్ పాండే.

ఎమ్మెల్యే తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే తాను చేసింది కరెక్టేనని సమర్ధించుకున్నారాయన. నాలాలు క్లీన్ చేయాలని 15 రోజుల కిందటే ఆదేశించినా పట్టించుకోలేదని అన్నారు. అందుకే కాంట్రాక్టర్ కు శిక్ష వేశానని చెప్పారు.


No comments:

Post a Comment