హైదరాబాద్ : 18/06/2021
దేశంలో భగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. ఒక్క నెలలో 10సార్లు పెంపు.. లీటరు ఎంతంటే ?
asianet news తెలుగు(ట్విట్టర్) సౌజన్యంతోఒక రోజు విరామం తరువాత నేడు పెట్రోల్, డీజిల్ ధరలు మళ్ళీ పెరిగాయి. గత కొద్దిరోజులుగా ఇంధన ధరలు వరుస పెంపుతో సామాన్యులకు చుక్కలు చూపిస్తుండగా నేడు తాజా పెంపుతో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయికి ఇంధన ధరలు ఎగిశాయి. ఈ రోజు పెట్రోల్ ధర పై 27 పైసలు పెరగగా, డీజిల్ ధర 28 పైసలు పెరిగింది.
గత నెల మే లో ఇంధన ధరలను 16 సార్లు సవరించగ, జూన్ నెలలో ఇప్పటివరకు 10సార్లు పెంపు చేశారు. చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఒఎంసి) ధరల సవరణలను తిరిగి ప్రారంభించిన తరువాత గత నెల మే 4 నుండి ఇంధన ధరలు పెరుగుతున్నాయి. ఈ కాలంలో పెట్రోల్ ధర లీటరుకు రూ.6.53, డీజిల్ రూ .6.96 పెరిగింది.

మే 4 నుండి పెట్రోల్ ధరల పెంపు తరువాత రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లడఖ్, కర్ణాటకతో సహా ఏడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో పెట్రోల్ ధర లీటరుకు రూ .100 దాటింది.
నగరం పెట్రోల్ డీజిల్
న్యూఢిల్లీ 96.93 87.69
ముంబై 103.08 95.14
కోల్‌కతా 96.84 90.54
చెన్నై 98.14 92.31
బెంగళూరు 100.17 92.97
హైదరాబాద్ 100.74 95.59
పాట్నా 99.00 93.01
భోపాల్ 105.13 96.35
జైపూర్ 103.57 96.69
లక్నో 94.14 88.10
తిరువనంతపురం98.91 94.17

గత నెలలో భోపాల్ లో పెట్రోల్ ధర మూడు అంకెలు దాటిన మొదటి రాష్ట్ర రాజధానిగా నిలిచింది. తరువాత జైపూర్, ముంబై ఉన్నాయి. ఈ వారం ప్రారంభంలో హైదరాబాద్ లో కూడా పెట్రోల్ ధర రూ.100 దాటింది. నేడు బెంగళూరు పెట్రోల్ ధర లీటరుకు రూ.100.17 ను తాకింది .

రాజస్థాన్ లోని శ్రీ గంగానగర్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ రేట్లు అత్యధికంగా ఉన్నాయి. ఇక్కడ పెట్రోల్ ధర లీటరుకు రూ.108.07. గత శనివారం డీజిల్ ధర కూడా మూడు అంకెలను తాకింది ప్రస్తుతం లీటరుకు రూ .100.82. మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్ జిల్లాలో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.107.71, డీజిల్ ధర రూ.98.74.

భారతదేశంలో స్థానిక పన్ను (వ్యాట్), సరుకు రవాణా ఛార్జీలను బట్టి ఇంధన ధరలు రాష్ట్రానికి మారుతూ ఉంటాయి. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఇంధనాలపై ఎక్సైజ్ సుంకం కూడా వసూలు చేస్తుంది.పెట్రోల్ రిటైల్ అమ్మకపు ధరలో 60 శాతం, డీజిల్ ధరలో 54 శాతానికి పైగా కేంద్ర, రాష్ట్ర పన్నులు ఉన్నాయి.

గత 15 రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్లో బెంచ్ మార్క్ ఇంధనం సగటు ధర, విదేశీ మారకపు రేట్ల ఆధారంగా చమురు కంపెనీలు ప్రతిరోజు పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షితాయి.

0227 జిఎంటి నాటికి బ్రెంట్ ముడి ఫ్యూచర్స్ 52 సెంట్లు (0.7 శాతం) తగ్గి బ్యారెల్ 72.56 డాలర్లకు పడిపోయింది, ఇది గురువారం 1.8 శాతం క్షీణించింది. యు.ఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యుటిఐ) ముడి ఫ్యూచర్స్ 48 సెంట్లు (0.7 శాతం) తగ్గి బ్యారెల్ 70.56 డాలర్లకు చేరుకున్నాయని, గురువారం 1.5 శాతం తగ్గినట్లు నివేదిక తెలిపింది.
No comments:
Post a Comment