హైదరాబాద్ : 23/06/2021
తెలంగాణలో మళ్లీ జేఏసీ జెండాలు !
తెలంగాణలో మళ్లీ ఉద్యమ వాతావరణం కనిపిస్తోంది. టీఆర్ఎస్ నిరంకుశ, నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా వివిధ సంఘాలు మరోసారి ఏకమవుతున్నాయి. ఇప్పటికే ఆర్టీసీ యూనియన్లు ఉమ్మడిగా ఉద్యమబాట పట్టేందుకు సిద్ధమవుతుండగా.. ఇతర సంస్థల్లో కూడా ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. ఆర్టీసీలో టీఎంయూ మినహా 10 యూనియన్లు కలిసి ఎలా జేఏసీగా ఏర్పడ్డాయో.. అధికార పార్టీ అనుబంధ సంఘాన్ని వదిలేసి కొత్తగా జాయింట్ యాక్షన్ కమిటీల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల వరకు రాష్ట్రంలో హుజురాబాద్ బైపోల్ మినహా వేరే ఎన్నికలు లేకపోవడంతో కేసీఆర్ తమకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తారనే నమ్మకం వివిధ సంస్థలు, వర్గాలకు చెందిన ఉద్యోగులు, కార్మికుల్లో కనిపిస్తోంది. దీంతో కేసీఆర్‌పై పోరాటం చేయాలంటే.. మళ్లీ జేఏసీల ఏర్పాటు అవసరం తథ్యమని వారు భావిస్తున్నారు.
తెలంగాణలో జేఏసీలకు ఎంతో చరిత్ర ఉంది. ప్రత్యేక రాష్ట్ర సాధనలో అవి చేసిన పోరాటం చాలా పెద్దది. కానీ రాష్ట్ర ఏర్పాటు తర్వాత.. చాలా వాటిని కేసీఆర్ నిర్వీర్యమయ్యేలా చేశారు. దీంతో రాజకీయ జేఏసీ మినహా మిగిలినవేవీ కూడా ఉనికిలో లేకుండాపోయాయి. ఇప్పుడు మళ్లీ ఏడేళ్ల తర్వాత.. తెలంగాణలో జేఏసీల మాట వినబడుతోంది.
No comments:
Post a Comment