హైదరాబాద్ : 11/06/2021
బీహార్‌లో డీఎస్పీగా ఎంపికైన తొలి ముస్లిం మహిళ
పట్నా: బీహార్‌లో డీఎస్పీగా ఎంపికైన తొలి ముస్లిం మహిళగా రజియా సుల్తాన్ రికార్డుల్లో నిలిచారు. గోపాల్‌గంజ్ జిల్లాలోని హతువా గ్రామానికి చెందిన ఆమె 64వ బీహార్ పబ్లిక్ సర్విస్ కమిషన్ ఎగ్జామ్స్‌లో (బీపీఎస్సీ) బీహార్ పోలీస్ ఫోర్స్‌లో డీఎస్పీగా ఎంపికయ్యారు. డీఎస్పీలుగా ఎంపికైన 40 మందిలో రజియ ఒకరు. ప్రస్తుతం ఆమె బీహార్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు.
రజియాది గోపాల్‌గంజ్ అయినప్పటికీ విద్యాభ్యాసం మాత్రం జార్ఖండ్‌లోని బొకారోలో పూర్తయ్యింది. ఆమె తండ్రి మహమ్మద్ అస్లామ్ అన్సారీ బొకారో స్టీల్ ప్లాంట్‌లో స్టెనోగ్రాఫర్‌గా పనిచేశారు. దీంతో ఆమె బొకారోలో పాఠశాల విద్య పూర్తిచేశారు. జోధ్‌పూర్‌లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ కంప్లీట్‌చేశారు.
చిన్నప్పటి నుంచి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాయాలన్నది తన కల అని, డీఎస్పీగా ఎంపికవ్వడంతో తన కల సాకారమయ్యిందని రజియా చెప్పారు. 2017లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ ఇంజినీర్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తాను బీపీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాని తెలిపారు. పోలీస్ అధికారిగా పనిచేయనుండటం చాలా సంతోషంగా ఉంది. ప్రజలకు సరైన న్యాయం అందని సందర్భాలు చాలా ఉన్నాయి, అందులో ముఖ్యంగా మహిళలు ఉన్నారు. మహిళలు తమకు జరిగే అన్యాయాలపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెనకడుగువేస్తున్నారు. ఇలాంటి కేసులు నమోదయ్యేలా తనవంతుగా ప్రయత్నిస్తానని చెప్పారు.
No comments:
Post a Comment