Tuesday, June 1, 2021

స్టాఫ్‌నర్సు ఉద్యోగాలకు అర్హుల కొరత

హైదరాబాద్ : 02/06/2021

స్టాఫ్‌నర్సు ఉద్యోగాలకు అర్హుల కొరత

స్టాఫ్‌నర్సు ఉద్యోగాలకు అర్హుల కొరత
  • 893 పోస్టులు క్యారీ ఫార్వర్డ్‌
  • తదుపరి నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ
  • సమావేశంలో టీఎస్‌పీఎస్సీ నిర్ణయం

హైదరాబాద్‌, జూన్‌ 1 (నమస్తే తెలంగాణ): స్టాఫ్‌నర్సు నోటిఫికేషన్‌లో ప్రకటించిన మొత్తం పోస్టుల నుంచి 893 పోస్టులను క్యారీ ఫార్వర్డ్‌ చేస్తూ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థులు లేకపోవడంతో వాటిని తదుపరి నోటిఫికేషన్‌ ద్వారా భర్తీచేయనున్నట్టు ప్రకటించింది. టీఎస్‌పీఎస్సీ నూతన సభ్యుల తొలి సమావేశాన్ని చైర్మన్‌ డాక్టర్‌ బీ జనార్దన్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం హైదరాబాద్‌ నాంపల్లిలోని కమిషన్‌ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల భారత సర్వీసు అధికారుల డిపార్ట్‌మెంటల్‌ ఎగ్జామ్స్‌ ఫలితాలకు కమిషన్‌ ఆమోదం తెలిపింది. గతంలో చేపట్టిన స్టాఫ్‌నర్సు పోస్టుల భర్తీపైనా సమీక్షించింది. వీటిలోని 893 పోస్టులను మరో నోటిఫికేషన్‌ ద్వారా భర్తీచేయాలని నిర్ణయించింది. డైరెక్టర్‌ పబ్లిక్‌ హెల్త్‌, తెలంగాణ వైద్యవిధాన పరిషత్‌లో 3,311 స్టాఫ్‌నర్సు పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ గతంలో నోటిఫికేషన్‌ విడుదలచేసింది. 70 మార్కుల రాత పరీక్ష, 30 మార్కులు ఎక్స్‌పీరియన్స్‌ వెయిటేజీతో ఎంపిక ప్రక్రియ చేపట్టింది. రెండు విడుతల్లో 3,172 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలిచి.. 2,418 మంది ఫలితాలను ఇటీవల వెల్లడించింది. ఓపెన్‌ 40, బీసీలకు 35, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 30 శాతం కనీస మార్కులుగా ప్రకటించినా.. అన్ని కోటాల్లో అభ్యర్థులు కనీస మార్కులు పొందలేదు. సమావేశంలో ప్రిన్సిపల్‌ సెక్రటరీ వాణీప్రసాద్‌, సభ్యులు రమావత్‌ ధన్‌సింగ్‌, ప్రొఫెసర్‌ చింతా సాయిలు, ప్రొఫెసర్‌ బీ లింగారెడ్డి, కోట్ల అరుణకుమారి, సుమిత్రానంద్‌ తనోబా, కారం రవీందర్‌రెడ్డి, డాక్టర్‌ ఎరవెల్లి చంద్రశేఖర్‌రావు, ఆర్‌ సత్యనారాయణ పాల్గొన్నారు.

No comments:

Post a Comment