తొలివెలుగు జర్నలిస్టు రఘును అరెస్ట్ చేసిన తీరుపై జాతీయ బీసీ కమిషన్ నిప్పులు చెరిగింది. రఘు ఓ తీవ్రవాది అయినట్టుగా రెక్కీ నిర్వహించి కిడ్నాప్ చేసి, ఆపై అరెస్ట్ చేసినట్టుగా ప్రకటించడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఈ వ్యవహారంపై పోలీసులకు జాతీయ బీసీ కమిషన్ నోటీసులు జారీ చేసింది. సూర్యాపేట జిల్లా SP, జిల్లా కలెక్టర్ ఈ నెల 21న ఢిల్లీకి రావాలని ఆదేశించింది.
తెలంగాణలో మానవ హక్కులు లేవా అంటూ ప్రభుత్వాన్ని ఘాటుగా ప్రశ్నించింది జాతీయ బీసీ కమిషన్. తెలంగాణ పోలీసులు.. ప్రజల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని.. ఇది ఏమాత్రం మంచి పరిణామం కాదని హితవు పలికింది. ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ పాలన కొనసాగించగలరా అని ప్రశ్నించింది. జర్నలిస్టులను వీధి రౌడీలుగా బావిస్తున్నారా అంటూ నిలదీసింది. పోలీసులు ఇలా వ్యవహరించటం సిగ్గుచేటు అని మండిపడింది. చట్టాన్ని రక్షించాల్సిన వారే అడ్డదారిలో వెళ్లటం ఆ ప్రజాస్వామికమని వ్యాఖ్యానించింది. కేసులో ముద్దాయిగా ఉంటే నోటీసు ఇచ్చి అరెస్ట్ చేయొచ్చని.. కానీ సాధారణ ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేలా పోలీసులు వ్యవహరించాని ఆక్షేపించింది.
తెలంగాణలో ఇలాంటివే అనేక కేసులు తమ దృష్టికి వచ్చాయని చెప్పింది. ఆదాబ్ హైదరాబాద్ ప్రతినిధి ఆనం చిన్ని వెంకటేశ్వర్ రావు ఖమ్మంలో మార్నింగ్ వాకింగ్ చేస్తుండగా కిడ్నాప్ చేసి, అరెస్ట్ చేశారని జాతీయ బీసీ కమిషన్ గుర్తు చేసింది. అదే రోజు కొల్లాపూర్ అవుట రాజశేఖర్ అనే జర్నలిస్టును కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌లో చిత్రహింసలు పెట్టిన సంగతిని నోటీసులో ప్రస్తావించింది. ఇక పెబ్బేరులో మందడి చిరంజీవిపై ఇలాంటివే అక్రమ కేసులు ఉన్నాయని తెలిపింది.
తొలివెలుగు మీడియా సౌజన్యంతో (ట్విట్టర్)
No comments:
Post a Comment