హైదరాబాద్ : 16/06/2021
నా తుదిశ్వాస వరకు… ప్రశ్నిస్తూనే వుంటా- జర్నలిస్టు రఘు
తెలంగాణలో జర్నలిజం దొర గడీలో బంధీ అయ్యింది… ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నం చేస్తున్న శక్తులపై పోరాటం చేస్తా. తెలంగాణ జర్నలిజం సత్తా ఎంటో చూపిస్తా… నా తుది శ్వాస వరకు ప్రజల కోసం జర్నలిస్టుగా ప్రశ్నిస్తూనే ఉంటా అంటూ జర్నలిస్టు రఘు స్పష్టం చేశారు.
పోలీసులను ఎదురించారని ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న 21మంది దళితులపై 307సెక్షన్ కేసులు పెట్టి హుజుర్ నగర్ జైల్లో ఉంచారని, వారంతా ఏడుస్తూ గోడు వెళ్లబోసుకున్నారన్నారు. గుర్రంపోడు భూముల్లో సాగులో ఉన్న గిరిజనులను, గిరిజన మహిళలను రక్తం వచ్చేలా కొట్టారని… బెదిరించారని అది తెలిసే వారి కోసం వెళ్లానన్నారు. ఇదే సైదిరెడ్డి ఎన్నికలప్పుడు పట్టాలిస్తానన్నారు… సాగర్ ఎన్నికలప్పుడు కేసీఆర్ కూడా చెప్పారు. మరి వారికి పట్టాలెందుకు ఇవ్వలేదని… వారికి రైతుబంధు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు.
నన్ను అరెస్ట్ ఏసేందుకు ముఖ్య కారణాల్లో మెడికల్ మాఫియా ఉందని… కరోనా సమయంలో తమ వారిని కాపాడుకునేందుకు ప్రజలు రక్తం దారపోసి లక్షలకు లక్షలు కట్టారు. ట్విట్టర్ లో ఏదో చేస్తున్నట్లు కొందరు నేతలు ప్రయత్నాలు చేస్తుంటే… వారు నా వీడియోలను జీర్ణించుకోలేకపోయారని అందుకే అరెస్ట్ చేశారన్నారు. మెడికల్ మాఫియా కారణంగా మధ్య తరగతి ప్రజలు పేదలుగా మారరని, పేదలు బ్రతుకలేని పరిస్థితులు వచ్చాయన్నారు. ఒక్కొక్కరికి 60లక్షలు బిల్లులేశారని… ఫ్రీగా వైద్యం ఇవ్వాల్సిన మెడికల్ కాలేజీలు కూడా వసూళ్లకు తెగబడ్డాయని, నా అరెస్ట్ కు ముందు రోజు కూడా మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ లో బిల్లులపై వీడియోలు చేశానన్నారు రఘు.
తాను జర్నలిస్టుగా పేద ప్రజల కోసం, ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై పోరాడేందుకు సిద్దంగా ఉన్నానని… ఇదే దూకుడుతో ఇక కూడా ముందుకు సాగుతానని జర్నలిస్టు రఘు స్పష్టం చేశారు.
No comments:
Post a Comment