హైదరాబాద్ : 14/06/2021
టీఎంసీ కార్యకర్తల అత్యాచారాలు- సుప్రీంలో కన్నీళ్లు పెట్టుకున్న మహిళలు
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విడుదలైన తర్వాత పశ్చిమ బెంగాల్‌లో అధికార టీఎంసీ కార్యకర్తలు జరిపిన దాష్టీకాలు ఒక్కోటి వెలుగులోకి వస్తున్నాయి. నెలన్నర రోజుల తర్వాత చాలా మంది బాధితులు నోరు విప్పుతున్నారు. టీఎంసీ కార్యకర్తలు అత్యంత దారుణంగా తమపై సామూహిక అత్యాచారాలకు పాల్పడ్డారంటూ సుప్రీంను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో తనపై కూడా గ్యాంగ్ రేప్ జరిగిందంటూ అరవై ఏళ్ల మహిళ ఒకరు తాను పడ్డ నరకయాతనను న్యాయస్థానానికి వివరించారు.
ఖేజూరి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి విజయం సాధించడంతో.. మే 3న 200 మంది వరకూ టీఎంసీ కార్యకర్తలు తమ ఇంటికి వచ్చి బాంబులతో తమ ఇంటికి పేల్చేస్తామని బెదిరించి వెళ్లారని తెలిపింది. ఆమరుసటి రోజే తన కోడలు ఇంటి నుంచి వెళ్లిపోగా..రాత్రి సమయంలో కొందరు టీఎంసీ కార్యకర్తలు ఇంట్లోకి చొరబడి.. మంచానికి కట్టేసి తన ఆరేళ్ల మనవడు ముందే తనపై గ్యాంగ్ రేప్ చేశారని కన్నీటి పర్యంతమైంది. ఆ తరువాత రోజు స్పృహలేని తనను స్థానికులు ఆస్పత్రికి తరలించారని తెలపింది. టీఎంసీ కార్యకర్తల అఘాయిత్యంపై తన అల్లుడు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయింది. తమ ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకునేందుకు.. వారి గొంతును మూసేందుకు అత్యాచారాలనే ఆయుధంగా టీఎంసీ కార్యకర్తలు వాడుకున్నారు అని సుప్రీం కోర్టుకు వివరించింది. దీనిపై సీబీఐతో కానీ సిట్‌తో కానీ విచారణ జరపించాలని ఆమె కోరింది. ఇందుకు సంబంధించిన విచారణను రాష్ట్రం వెలుపలకి మార్చమని అభ్యర్థించింది. పోలీసుల తనకు జరిగిన అన్యాయంపై సానుభూతి కూడా లేకుండా.. కేసులు విత్ డ్రా చేసుకోవాలని ఒత్తిడి తీసుకొస్తున్నారని బాలిక ఆరోపించింది.
మే 9న తనపై కూడా టీఎంసీ కార్యకర్తలు అత్యాచారం జరిపారని ఓ దళితవర్గానికి చెందిన ఓ మైనర్ బాలిక కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సీబీఐ దర్యాప్తు జరిపించాలని వేడుకుంది. తాను మరణించాననుకొని అడవిలోకి ఈడ్చుకుని వెళ్లి వదిలేశారన్న బాధితురాలు.. ఆ మర్నాడు తన ఇంటికి వెళ్లి పోలీస్ కంప్లెయింట్ ఇస్తే వారిని చంపుతామని బెదిరించారని కోర్టుకు వివరించింది. ఇక మరో బాధితురాలు తన కళ్లముందే తన భర్తను గొడ్డలితో నరికి చంపారని… ఆయన శవం పక్కన ఉండగానే తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేసింది. మే 14న ఈ ఘటన జరిగినట్టు చెప్పింది. తన భర్త బీజేపీ తరపున ప్రచారం చేసినందుకు ఈ ఘోరానికి పాల్పడ్డారని ఆమె కోర్టుకు వివరించింది
No comments:
Post a Comment