హైదరాబాద్ : 01/07/2021
చెస్ అభిమన్యుడు
12 ఏండ్లకే గ్రాండ్‌మాస్టర్ హోదా
నమస్తే తెలంగాణ మీడియా ట్విట్టర్ సౌజన్యంతో
న్యూయార్క్: భారత సంతతికి చెందిన అమెరికా కుర్రాడు అభిమన్యు మిశ్రా చరిత్ర సృష్టించాడు. ప్రపంచ చెస్ చరిత్రలోనే అతి పిన్న వయస్కుడైన(12 ఏండ్ల 4నెలలు) గ్రాండ్ మాస్టర్‌గా అవతరించాడు. న్యూజెర్సీకి చెందిన అభిమన్యు బుధవారం భారత్‌కు చెందిన 15 ఏండ్ల లియోన్ మెన్‌డోన్కాపై విజయంతో గ్రాండ్‌మాస్టర్ హోదా దక్కించుకున్నాడు. నల్ల పావులతో బరిలోకి దిగిన అభిమన్యు..అద్భుత ప్రదర్శనతో గ్రాండ్‌మాస్టర్ అయ్యేందుకు కావాల్సిన ఎలో రేటింగ్‌ను కైవసం చేసుకున్నట్లు చెస్ డాట్‌కామ్ ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో 19 ఏండ్ల క్రితం రష్యా గ్రాండ్‌మాస్టర్ సెర్గె కర్జాకిన్(12 ఏండ్ల 7 నెలలు) నెలకొల్పిన అతిపిన్న గ్రాండ్‌మాస్టర్ రికార్డును తాజాగా అభిమన్యు తిరుగరాశాడు.
No comments:
Post a Comment