Thursday, June 24, 2021

యాదాద్రి జిల్లా అడ్డగూడూరు ఠాణాలో మహిళ మృతిపై న్యాయ విచారణకు హైకోర్టు ఆదేశించింది. మరియమ్మ మృతిపై విచారణ

హైదరాబాద్ : 24/06/2021

Ts New: మరియమ్మ మృతిపై హైకోర్టు విచారణ

ఈనాడు మీడియా (ట్విట్టర్) సౌజన్యంతో 

Ts New: మరియమ్మ మృతిపై హైకోర్టు విచారణ

హైదరాబాద్‌: యాదాద్రి జిల్లా అడ్డగూడూరు ఠాణాలో మహిళ మృతిపై న్యాయ విచారణకు హైకోర్టు ఆదేశించింది. మరియమ్మ మృతిపై విచారణ జరపాలని ఆలేరు మెజిస్ట్రేట్‌ను ఆదేశించిన ఉన్నత న్యాయస్థానం.. నివేదికను సీల్డ్‌ కవర్‌లో సమర్పించాలని స్పష్టం చేసింది. అవసరమైతే రీపోస్టుమార్టం జరపాలని తెలిపింది. పోలీసు స్టేషన్‌లో సీసీ కెమెరాలు లేకపోవడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. పోలీస్‌స్టేషన్‌లో సీసీ కెమెరాల ఏర్పాటుకు గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది. పీయూసీఎల్‌ ప్రధాన కార్యదర్శి జయ వింధ్యాల పిల్‌పై విచారణ జరిపిన హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది. 

రాచకొండ సీపీకి మానవ హక్కుల కమిషన్‌ నోటీసులు 

పోలీసు కస్టడీలో చనిపోయిన దళిత మహిళ మరియమ్మ ఘటనపై నివేదిక ఇవ్వాలని రాచకొండ సీపీకి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. మరియమ్మ చనిపోయిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని దళిత, బహుజన విద్యార్థి సమాఖ్య రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేసింది. దొంగతనం చేసిందనే నెపంతో మరియమ్మను, ఆమె కుమారుడిని యాదాద్రి జిల్లా అడ్డగూడూరు పోలీసు స్టేషన్‌ తీసుకొచ్చారని పేర్కొంది. పోలీసు సిబ్బంది విచక్షణా రహితంగా కొట్టడం వల్లే మరియమ్మ చనిపోయిందని దళిత సంఘాల నాయకులు కమిషన్‌ దృష్టికి తీసుకొచ్చారు. రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ సదరు సిబ్బందిని సస్పెండ్‌ చేసి చేతులు దులిపేసుకున్నారని తెలిపారు. ఈ ఘటనపై జులై 28లోపు సమగ్ర నివేదిక సమర్పించాలని రాచకొండ సీపీకి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. 

No comments:

Post a Comment