తహసీల్దార్ ఆఫీస్ గేటుకు తాళిబొట్టును వేలాడదీసి మహిళ నిరసన......!*
సిరిసిల్ల: తమకు చెందిన భూమిని రెవెన్యూ అధికారులు ఇతర వ్యక్తులకు పట్టా చేశారన్న ఆవేదనతో ఓ మహిళ వినూత్న రీతిలో ఆందోళనకు దిగారు. తన తాళిబొట్టు లంచంగా తీసుకుని న్యాయం చేయాలంటూ.. తహశీల్దార్ కార్యాలయ గేటుకు వేలాడదీశారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో చోటుచేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం... మానాల గ్రామానికి చెందిన పొలాస రాజేశం- మంగ దంపతులకు సర్వే నెంబరు-130/14లో 2 ఎకరాల భూమి ఉంది. కాగా రాజేశం మూడు సంవత్సరాల క్రితం చనిపోయారు. ఈ క్రమంలో బతుకుదెరువు రీత్యా మంగ మెట్‌పల్లికి వెళ్లారు.అయితే తాను లేని సమయంలో రెవెన్యూ అధికారులతో ఎంక్వైరీ చేయించుకుని ఇతర వ్యక్తులు తమ పేరున భూమిని పట్టా చేయించుకున్నట్లు ఆమె ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో... బుధవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయానికి చేరుకున్న మంగ.. ఆఫీసు గేటుకు తాళిబొట్టు వేలాడదీసి నిరసన వ్యక్తం చేశారు. తన భర్త చనిపోయాడని, జీవనాధారంగా ఉంటుందనుకున్న భూమిని కూడా ఇలా అక్రమంగా పట్టా చేసుకుంటే ఎలా అంటూ భావోద్వేగానికి గురయ్యారు. తాళిబొట్టును తీసుకుని తనకు న్యాయం చేయాలంటూ ఆవేదన వ్యక్తం
చేశారు.
*link Media ప్రజల పక్షం🖋️*
చేశారు.
*link Media ప్రజల పక్షం🖋️*
prajasankalpam1.blogspot.com
No comments:
Post a Comment