Thursday, June 3, 2021

ర‌ఘు అరెస్ట్ మీడియాపై దాడే… ప్రెస్ కౌన్సిల్ ఏం చేస్తుంది?- దాసోజు

హైదరాబాద్ : 03/06/2021

ర‌ఘు అరెస్ట్ మీడియాపై దాడే… ప్రెస్ కౌన్సిల్ ఏం చేస్తుంది?- దాసోజు

నిరంత‌రం ప్ర‌భుత్వ త‌ప్పిదాల‌ను ఎత్తి చూపుతూ, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను త‌న ఇంట‌ర్వ్యూల ద్వారా ప్ర‌జ‌ల‌ను చైత‌న్యం చేసే రఘు కిడ్నాప్ ను కాంగ్రెస్ నేత దాసోజు శ్ర‌వ‌ణ్ ఖండించారు. తొలివెలుగు జర్నలిస్ట్ రఘుని కొంతమంది దుండగులు కిడ్నాప్ చేసినట్లు తెలిసింద‌ని, ర‌ఘుకు ఏం జ‌రిగినా ప్ర‌భుత్వానిదే బాధ్య‌త అని శ్ర‌వ‌ణ్ హెచ్చ‌రించారు.

వెనుకబడిన తరగతులకు చెందిన రఘు మంచి సామజిక అవగాహన కలిగిన చురుకైన జర్నలిస్ట్ అని, పోలీసులు వెంట‌నే చ‌ర్య‌లు తీసుకొని కిడ్నాప‌ర్ల చెర నుండి ర‌క్షించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. దీన్ని మీడియాపై దాడిగా గుర్తించి, ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ అల్లం నారాయణ గారు రఘుని కాపాడేందుకు ప్రభుత్వం పై వత్తిడి తేవాలని విజ్ఞప్తి దాసోజు విజ్ఞ‌ప్తి చేశారు.

గుర్రంపోడు భూముల విష‌యం ఏంటంటే…

హుజుర్ న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలోని గుర్రంగోడులో గిరిజ‌నుల భూముల‌పై ఎమ్మెల్యే సైదిరెడ్డి, ఆయ‌న అనుచ‌రులు క‌న్ను వేశార‌ని… ఆక్ర‌మిస్తున్నార‌ని బీజేపీ చ‌లో గుర్రంగోడుకు పిలుపునిచ్చింది. బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ స‌హా ప‌లువురు అక్క‌డికి వ‌స్తుండ‌టంతో జ‌ర్న‌లిస్ట్ ర‌ఘు క‌వ‌రేజ్ కోసం అక్క‌డికి వెళ్లారు. అక్క‌డ ఉన్నఓ చిన్న రేకుల షెడ్యును బీజేపీ కార్య‌క‌ర్త‌లు కూల్చే ప్ర‌య‌త్నం చేయ‌గా… అక్క‌డ షెడ్డు ఉంద‌ని బండి సంజ‌య్ కు చెప్పి, కూల్చేలా కుట్ర ప‌న్నిందే ర‌ఘు అని పోలీసులు కేసు పెట్టారు. సైగ‌ల ద్వారా ర‌ఘు కుట్ర చేశాడ‌న్న‌ది ఆరోప‌ణ‌.

అయితే, ఈ ఎఫ్.ఐ.ఆర్ లో అరెస్ట్ చేయకుండా న్యాయ‌స్థానం నుండి అప్పుడే ఆదేశాలు కూడా వ‌చ్చాయి.

 


No comments:

Post a Comment