Thursday, June 24, 2021

రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణకు ఇప్పటివరకు సుమారు 96 లక్షల టీకాలు ఇవ్వడం జరిగింది :సోమేశ్ కుమార్ CS

హైదరాబాద్ : 25/06/2021



రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణకు ఇప్పటివరకు సుమారు 96 లక్షల టీకాలు ఇవ్వడం జరిగిందని, రాబోయే రెండు రోజుల్లో కోటి టీకాల మార్కును దాటనున్నట్లు సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ ఆదేశాల మేరకు 25 లక్షల మంది హై రిస్క్ గ్రూపులకు చెందిన వారికి టీకాలు ఇచ్చినట్లు తెలిపారు. https://t.co/NQqn0NnD17 
గురువారం సికింద్రాబాద్ మోండా మార్కెట్‌లో ఏర్పాటు చేసిన 'పనిప్రదేశపు వ్యాక్సినేషన్ సెంటర్'ను సీఎస్ పరిశీలించారు. వీధి వ్యాపారులతో మాట్లాడి టీకాలు తీసుకోవల్సిందిగా ఉత్తేజపరిచారు. తమ పని ప్రదేశంలోనే టీకాలు వేసేందుకు ప్రభుత్వం తీసుకున్న చొరవను వీధి వ్యాపారులు అభినందించారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలోని మొత్తం 100 కేంద్రాలలో 30 సంచార బృందాలతో టీకాలు వేస్తున్నట్లు సీఎస్ తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 'మాప్ అప్ డ్రైవ్' జరుగుతోందని, ప్రత్యేక డ్రైవ్ లో టీకా తీసుకోని వారందరూ దీనిలో తీసుకోవచ్చని అన్నారు. ఆరోగ్యశాఖ సిబ్బంది సేవలను ఈ సందర్భంగా సీఎస్ అభినందించారు.
ఈ పర్యటనలో వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి తదితర అధికారులు పాల్గొన్నారు. #COVID19Vaccination



No comments:

Post a Comment