Tuesday, June 15, 2021

కేంద్రం-ట్విట్ట‌ర్ మ‌ధ్య ముదురుతున్న వివాదం

హైదరాబాద్ : 15/06/2021

కేంద్రం-ట్విట్ట‌ర్ మ‌ధ్య ముదురుతున్న వివాదం

తొలివెలుగు మీడియా (ట్విట్టర్) సౌజన్యంతో 

కేంద్ర ప్ర‌భుత్వం, ట్విట్ట‌ర్ ఇండియా మ‌ధ్య వివాదం తారాస్థాయికి చేరింది. తాము తెచ్చిన కొత్త ఐటీ చ‌ట్టాల‌ను అమ‌లు చేయాల్సిందేన‌ని కేంద్రం, భావ‌ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ‌ను హ‌రించ‌రాద‌ని ట్విట్ట‌ర్ ప‌ట్టుబ‌ట్టుకొని కూర్చోవ‌టంతో… విష‌యం కోర్టుల వ‌ర‌కు వెళ్లింది. కేంద్రం ఇప్ప‌టికే ట్విట్ట‌ర్ కు చివ‌రి నోటీసు కూడా ఇచ్చింది.

తాజాగా ట్విట్టర్‌కు పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ నోటీసులు జారీ చేసింది. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీపై ఈ నెల 18న సాయంత్రం 4 గంటలకు పార్లమెంట్ కాంప్లెక్స్‌లో ప్యానెల్ ఎదుట హాజరుకావాలని ట్విట్ట‌ర్ ను ఆదేశించింది. డిజిటల్‌ వేదికలపై పౌరుల హక్కుల పరిరక్షణ, మహిళల భద్రత, ఆన్‌లైన్‌ వార్తలు దుర్వినియోగం కాకుండా తీసుకునే చర్యలపై వివరణ ఇవ్వాలని కోరింది.

కేంద్రం తెచ్చిన కొత్త నిబంధ‌న‌ల ప్ర‌కారం చీఫ్ కంప్లైన్స్ అధికారిని నియ‌మించాల్సి ఉంది. ఆ అధికారి కూడా ఇండియ‌న్ సిటిజ‌న్ అయి ఉండాలి. అయితే, ఈ నిబంధ‌న అమ‌లులో దిగి వ‌చ్చిన ట్విట్ట‌ర్ చీఫ్‌ కంప్లైయెన్స్‌ ఆఫీసర్‌ను నియామకాన్ని పూర్తి చేసే దశలో ఉన్నామని, రాబోయే రోజుల్లో అదనపు వివరాలు అందించేందుకు ప్రణాళిక చేస్తున్నట్లు ఈ నెల 7న కేంద్రానికి ట్విట్ట‌ర్ ఇండియా లేఖ రాసింది.


No comments:

Post a Comment