హైదరాబాద్ : 15/06/2021
కేసీఆర్ సర్కార్ “డెత్ గేమ్”- ది హిందూ సంచలనాత్మక కథనం
తెలంగాణ హైకోర్టుతో సహా అందరూ అనుమానిస్తున్నదే, అన్ని రాష్ట్రాలు సందేహిస్తున్నదే.. అదే నిజమైంది. కరోనా మరణాల లెక్కలను దాస్తోందన్న వాస్తవం ఆధారాలతో సహా బట్టబయలైంది. ఒక్క హైదరబాద్‌లోనే వేలాది కరోనా మరణాలను రాష్ట్ర ప్రభుత్వం దాచిపెట్టిన విషయం తాజాగా బయటపడింది. కేసీఆర్ ప్రభుత్వం చెబుతున్న అవాస్తవాలను ఏకిపారేస్తూ.. తాజాగా ది హిందూ రాసిన కథనం రాష్ట్రంలో సంచలనం రేపుతోంది.
2016-2019 మధ్యకాలంలో హైదరాబాద్‌లో ఏటా సగటు మరణాల సంఖ్య 21,709గా ఉంది. కానీ హిందూ కథనం ప్రకారం.. 32,752 అదనపు మరణాలు సంభవించాయి. ఇందులో గత ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య 18,420 అదనపు మరణాలు సంభవిస్తే.. ఈ ఏడాది తొలి 5 నెలల్లో ఏకంగా 14,332 మంది అదనంగా అనుమానాస్పద రీతిలో చనిపోయారు. ఆర్టీఐ ద్వారా సంపాదించిన వివరాలతో .. ప్రభుత్వం చెబుతున్న అబద్ధాలను కడిగిపారేసింది.
బెంగళూరు వంటి నగరాలతో పోలిస్తే.. జీహెచ్ఎంసీ నమోదు చేసిన లెక్కల కంటే 17.5 రెట్లు అధికంగా మరణాలు ఒక్క హైదరాబాద్‌లోనే నమోదై ఉండొచ్చని ది హిందూ అంచనా వేసింది. ఆ లెక్కన తెలంగాణలో వాస్తవంగా కరోనా మరణాల సంఖ్య 57 వేల నుంచి లక్ష వరూ ఉండొచ్చని విశ్లేషించింది. జిల్లాలవారీగా మరణాల వివరాలు తెలిస్తే.. వాటిపై ఓ స్పష్టమైన అంచనాకు రావొచ్చని తెలిపింది. దురదృష్టవశాత్తు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు జిల్లాలవారీగా నమోదైన మరణాలను కూడా వెల్లడిస్తోంటే.. తెలంగాణలో మాత్రం అది జరగడం లేదని ది హిందూ చెప్పుకొచ్చింది.
No comments:
Post a Comment