Monday, June 28, 2021

పీవీకి సముచిత గౌరవం కల్పించిన సీఎం కేసీఆర్‌

హైదరాబాద్ : 28/06/2021

పీవీకి సముచిత గౌరవం కల్పించిన సీఎం కేసీఆర్‌

పీవీకి సముచిత గౌరవం కల్పించిన సీఎం కేసీఆర్‌

నిర్మల్‌ : దేశాన్ని ఆర్థిక సంస్కరణలతో పురోగతి బాట పట్టించిన దివంగత మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావుకు అసలైన గౌరవమిచ్చింది సీఎం కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వమని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సోమ‌వారం పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో పీవీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి సంపన్న భారత దేశం రూపొందడానికి బాటలు నిర్మించిన అసాధారణ నేత, బహుముఖ ప్రజ్ఞాశాలిగా మ‌న పీవీ కీర్తిని పొందారని ఆయ‌న చేసిన సేవ‌ల‌ను కొనియాడారు.


పీవీ శతజయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌..పీవీ సేవలను గుర్తు చేసుకుంటూ ప్రభుత్వం తరఫున ఏడాది పొడ‌వునా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారన్నారు. పీవీ నరసింహారావు ఈ దేశం కోసం ఎంతో చేసినా, ఆయన్ను కాంగ్రెస్ పార్టీ మరచిపోయిందని తెలిపారు. కానీ పీవీ నరసింహారావు కూతురు వాణిదేవికి టీఆర్ఎస్ టికెట్ ఇచ్చి ఎమ్మెల్సీగా గెలిపించుకున్నామని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా పీవీతో తనకున్న అనుబంధాన్ని మంత్రి గుర్తు చేసుకున్నారు. 1991నుంచి పీవీతో ప‌రిచ‌యం ఉంద‌ని, ఎంపీగా ఉన్న స‌మ‌యంలో తాను టీడీపీకి రాజీనామ చేసి మైనార్టీలో ఉన్న పీవీ ప్రభుత్వానికి మద్దతునిచ్చాన‌న్నారు. పీవీ ఆశ‌యాలు, అలోచ‌న‌ల‌కు అనుగుణంగా యువ‌త న‌డుచుకోవాల‌ని మంత్రి పిలుపునిచ్చారు.

No comments:

Post a Comment