Tuesday, September 1, 2020

భూ వివాదాల పరిష్కారానికి కాలపరిమితి.

హైదరాబాద్ : 02/09/2020

*భూ వివాదాల పరిష్కారానికి కాలపరిమితి.....!*

నాలుగంచెల్లో కొత్త రెవెన్యూ చట్టం
నెలన్నరదాటితే *తహసీల్దార్‌ నుంచి కలెక్టర్‌ వద్దకు*..
జిల్లా స్థాయిలో ట్రిబ్యునల్‌.. తేలకపోతే రెవెన్యూ కోర్టుకు
కీలక సంస్కరణలకు ప్రభుత్వం కసరత్తు

*రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనకు* ప్రభుత్వం సుదీర్ఘ కసరత్తు చేస్తోంది. వివాద, అవినీతి రహిత పాలన అందించేలా ఈ వ్యవస్థను మలచాలని భావిస్తున్న సర్కారు.. భూ వివాదాలను నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించే దిశగా అడుగులు వేస్తోంది. *అక్రమాలు, అవినీతి ఆరోపణలు మూటగట్టుకున్న రెవెన్యూ శాఖను* సంస్కరించాలని సీఎం కేసీఆర్‌ పట్టు్టదలగా ఉన్నారు. *కేశంపేట, కీసర, షేక్‌పేట తదితర తహసీల్దార్ల అవినీతి లీలలు, కొన్నాళ్ల కిందట అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ సజీవ దహనం çఘటన తో అవాక్కయిన ప్రభుత్వం..*
ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో నూతన రెవెన్యూ చట్టం ముసాయిదా బిల్లు ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది.
*20 కీలక నియమాలతో.*
ప్రస్తుతం మనుగడలో ఉన్న 144 చట్టాలు/నియమాల్లో కాలం చెల్లినవాటికి మంగళం పాడి.. కేవలం 20 చట్టాలను క్రోడీకరిస్తూ కొత్త చట్టం రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా *రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారులు శివశంకర్, బలరామయ్య, రంగారెడ్డి జిల్లా మాజీ జేసీ సుందర్‌ అబ్నార్‌ తదితర రెవెన్యూ, న్యాయ నిపుణులతో కూడిన కమిటీ వారం రోజులుగా కొత్త చట్టం తయారీపై సంప్రదింపులు జరుపుతోంది*. ఉద్యోగుల సర్దుబాటు, హోదాల మార్పులు, చేర్పులు తదితర అంశాలపై చర్చిస్తున్న ప్రభుత్వ పెద్దలు.. రెవెన్యూ వివాదాల పరిష్కారానికి నిర్దిష్ట కాలపరిమితిని నయా చట్టంలో చేర్చనున్నారు. తహసీల్దార్‌ స్థాయిలో 45 రోజుల్లో పరిష్కారం కాని అర్జీని నేరుగా *కలెక్టర్‌కు* పంపాలని, అక్కడా పరిష్కారం కాకపోతే జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసే ట్రిబ్యునల్‌కు నివేదించాలని, అది ఇచ్చే తీర్పు సంతృప్తికరంగా లేదని భావిస్తే.. రెవెన్యూ కోర్టుకు అప్పీల్‌ చేసుకునేలా కొత్త విధానం ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది.
దరఖాస్తు పురోగతి వివరాలు
*భూ వివాదాలు సకాలంలో*
భూ వివాదాలు సకాలంలో పరిష్కరించేందుకు కొత్త విధానం దోహదపడుతుందని భావిస్తోంది. ఈ క్రమంలోనే సమస్యల పరిష్కారంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వినియోగించుకోవాలని నిర్ణయించింది. దరఖాస్తుదారు అర్జీ దాఖలు చేసింది మొదలు... దాని పురోగతి (స్టేటస్‌) ఎలా ఉంది? ఏ అధికారి వద్ద పెండింగ్‌లో ఉందనే సమాచారాన్ని కూడా ఆన్‌లైన్‌లోనే చూసుకునేలా ఏర్పాట్లు చేయనుంది.

సుజీవన్ వావిలాల
ప్రజల పక్షం

బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/ 

No comments:

Post a Comment