హైదరాబాద్ : 17/09/2020
*తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు*
*ఎల్‌ఆర్‌ఎస్ రాజ్యాంగబద్ధతపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది*. అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణను సవాల్ చేస్తూ *ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్* దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. ఎల్‌ఆర్‌ఎస్ పలు చట్టాలకు విరుద్ధంగా ఉందని, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, మున్సిపాలిటీలు, పంచాయతీరాజ్ చట్టాల్లో క్రమబద్ధీకరణకు అవకాశం లేదని పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది సత్యం రెడ్డి వాదించారు.
ఎల్‌ఆర్‌ఎస్‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు రెండు వారాలు గడువు ఇవ్వాలని అడ్వొకేట్ జనరల్(ఏజీ) బీఎస్ ప్రసాద్ కోరారు. అయితే ఇప్పటి వరకు ప్రక్రియను ఆపాలని లేదా తుది తీర్పునకు లోబడి ఉంటుందని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషనర్ ధర్మాసనాన్ని కోరారు. దీనిపై స్పందించిన ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వ వైఖరి తెలుసుకోకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను అక్టోబర్ 8కి వాయిదా వేసింది.
సుజీవన్ వావిలాల
ప్రజల పక్షం
బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం
https://prajasankalpam1.blogspot.com/
No comments:
Post a Comment