హైదరాబాద్ : 16/09/2020
*ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖ*
---------------------------------------
అయ్యా
ముఖ్యమంత్రి గారు
LRS మేము కట్టలేము,నూటికి 80శాతం ప్రజలమైన మేము
పేద,మధ్యతరగతి ప్రజల ము,వంశ పరం పరంగ వచ్చినవి లేదా కష్టం చేసి కూడ పెట్టుకున్న పైసలతో 60గజాలో,100 గజాలో,200 ఇల్లు కట్టు కోడానికో కొనుకున్నాము,వాటిని దొంగ వని,అక్రమమైనవి అని ప్రజలను అంటూ,పైసలు కడితే సక్రమం చేస్తా అంటున్నారు,ఐదో,పదో తీసుకొని సక్రమం చేయ లేరా సారు,మీ మేధావి తనాన్ని ఉపయోగించి, నెలకు ఐదు వేల నుండి ముప్పై వేలు సంపాదించటం మాకు చాలా కష్టం లక్షలకు లక్షలు LRS కు యెట్లా కడుతాము సార్,ఈ విషయం మీకు మీ మంత్రులకు,మీ అధికారులకు తట్టనే లేదా? *మీరంటే నెలకు నాలుగు లక్షలకు పైగా జీతం తీసుకొని పని చేసే గొప్ప ప్రజా సేవకులు,నాలుగు వందల యేక రాలు ఉన్న భూస్వామి,బినామీ ల పెర ఎంతుందో మాకు తెలవదు సార్*,మీరు ఇలాంటి LRS లు ఎన్నైనా కట్టగలరు, *ఇక మీ మంత్రులు,ఎమ్మెల్యే లు,మీ పాలనలో వందల ఏకరాలూ కూడ బెట్టు కున్నారు,బువ్వకు లేనొడు కూడా భూస్వామి అయిండు,మీ అధికారులు అమ్యమ్యలు తీసుకొని ఆస్తులు బాగానే కూడ బెట్టుకున్నారు*,వాళ్ళు కట్ట గలర్ సారు,మీకు *ఈ సలహా ఇచ్చిన అధికారి పేరు చెప్పండి సార్ వారికి ప్రజలు సన్మానం చేయాలనుకుంటున్నారు*,అవును సార్ మరి ఈ అక్రమ లేవుట్ల లోని ప్లాట్ల కు,LRS తో వసూలు చేసిన పైసలు అదే లేఅవుట్ లో సదుపాయాలకు,కర్చుపెడుతారా సార్,ఒక్క పైసా,కూడా ఇంకో రంగానికి మల్లించ కూడదు,అదైనా చెప్పండి సార్,మీరు అసలే మాట తప్పని మనిషి, తలైనా నర్కుంటారు కాని మాట తప్పరని మాకు బాగా తెలుసు,అవును సార్ LRS ఉంటేనే రిజిస్టర్ చేస్తామని చెప్పడం బయ పెట్టడం చట్ట విరుద్ధం సార్,మీ అధికారులు మీరు అబాసుపాలవుతారు,నవ్వుల పాలవుతారు సార్,ప్రజలకు న్యాయం చేయడానికి కోర్టులు ఉన్నాయి సార్,తెలంగాణ పోరాటం లో,తెలంగాణ కోసం పాడిన వారు,ఆడిన వారు,పాటలు రాసిన వారు,మీరు పెట్టే పదవుల బిక్సకో, పైసల బీక్సకో,మీ పాదాల చెంత సిగ్గు లేకుండా వాలి పోయారు,మీకు,ప్రజలకు మద్య సైంధవులు గా, శికండి లుగా గళం విప్పకుండా బ్రతుకు చున్నారు,LRS చార్జీల పైన,వివిధ పార్టీల నాయకులు,ప్రజాసంఘాలు,మీకు బయపడి గళం విప్పడం లేదు,ఎందుకంటే వారికథ మీరు బయట పెడతారని బయ్యం, ఆకరిగా సార్ LRS మేము కట్టలేము,కావాలంటే మా ప్లాట్లను మీరు మీ మంత్రులు ఎమ్మెల్యే లు,అధికారులు తీసుకోండి దొరా నీ బాంచెన్ కాలుమొక్కుతాం,ఇట్లు మీకు ఓట్లు వేసిన అమాయక ప్రజల ము🔥😭😭😭😭😭😭😭😭😭😭😭
*Source*
నార గొని మాట నవతరానికి బాట
బాపట్ల కృష్ణమోహన్
https://prajasankalpam1.blogspot.com/
No comments:
Post a Comment