Thursday, September 3, 2020

ACB విచారణ - రెవిన్యూ లంచగొండి అధికారి

హైదరాబాద్ : 03/09/2020

*బ్రేకింగ్ న్యూస్*

*కీసర లంచం కేసులో ఏసీబి....... పురోగతి*

*కీలక విషయాలు వెల్లడించిన నాగరాజు, శ్రీనాథ్‌*
కీసర మాజీ తహసీల్దార్‌ నాగరాజు లంచం కేసులో అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు కీలక పురోగతి సాధించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు నలుగురు నిందితులను మూడు రోజులు కస్టడీలోకి తీసుకుని వారి నుంచి కీలక సమాచారాన్ని సేకరించారు. మాజీ తహసీల్దార్ నాగరాజు, స్థిరాస్తి వ్యాపారి శ్రీనాథ్‌ కీలక విషయాలను వెల్లడించినట్లు ఏసీబీ అధికారులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. *మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌, కీసర ఆర్డీవో ఆదేశాలతో భూవివాదంపై వ్యాపారులతో చర్చించేందుకు అతిథి గృహానికి వెళ్లినట్లు మాజీ తహసీల్దార్‌ నాగరాజు ఏసీబీ అధికారులకు చెప్పినట్లు సమాచారం.*
దీనిలో ఉన్నతాధికారుల పాత్రపై ఏసీబీ అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు.
గత పదేళ్లలో విలువైన ఆస్తులను కూడబెట్టినట్లు నాగరాజు ఏసీబీ విచారణలో అంగీకరించినట్లు తెలిసింది. విలువైన ఇళ్లు, ప్లాట్లు కొనుగోలు చేసినట్లు అతడు ఒప్పుకున్నట్లు సమాచారం. మరోవైపు *హన్మకొండ తహసీల్దార్‌ కిరణ్‌ ప్రకాశ్‌ ద్వారా కీసర ఆర్డీవో రవితో తనకు పరిచయం ఏర్పడిందని స్థిరాస్తి వ్యాపారి శ్రీనాథ్‌ ఏసీబీ విచారణలో తెలిపారు*. కీసర ఆర్డీవో ద్వారా మాజీ తహసీల్దార్‌ నాగరాజుతో ఒప్పందం జరిగినట్లు వెల్లడించారు. రాంపల్లి దాయరలో భూమిని మ్యుటేషన్‌ చేయించేందుకు నాగరాజుతో ఒప్పందం కుదుర్చుకున్నామని.. దీనికోసం అంజిరెడ్డి సాయంతో పట్టాదారుల మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేశామని తెలిపారు. కలెక్టర్‌తో భూమి మ్యుటేషన్‌ చేయించే బాధ్యత *ఆర్డీవో, తహసీల్దార్‌* చూసుకుంటామన్నారని ఏసీబీ అధికారులకు శ్రీనాథ్‌ వెల్లడించారు. రూ.1.10కోట్లను వరంగల్‌ నుంచి తన స్నేహితుల సాయంతో తీసుకొచ్చినట్లు ఆయన అంగీకరించారు. ఈ కేసులో మరికొంత కీలక సమాచారం సేకరించడంతో పాటు నాగరాజు బినామీ ఆస్తులను గుర్తించే పనిలో ఏసీబీ అధికారులు నిమగ్నమయ్యారు.

సుజీవన్ వావిలాల
ప్రజల పక్షం

బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/ 

No comments:

Post a Comment