Friday, September 11, 2020

తెలంగాణ రెవిన్యూ సంఘాల నాయకులు మారాలి

హైదరాబాద్ : 12/09/2020

*వీఆర్ఏలకు పే స్కేల్‌తో పాటు వారసత్వ ఉద్యోగాల ప్రకటనపై ధన్యవాదాలు : *ట్రెసా*
అసెంబ్లీలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు రెవెన్యూ శాఖ సేవలను కొనియాడుతూ రెవెన్యూ ఉద్యోగుల పని తీరును మెచ్చుకోవడం యావత్ రెవెన్యూ ఉద్యోగుల్లో నైతిక స్థైర్యం పెరిగిందని *తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) సంతోషం వ్యక్తం చేసింది.* రాబోయే రోజుల్లో రైతులు, ప్రజల సంక్షేమం కోసం రెవెన్యూ శాఖ రెట్టింపు ఉత్సాహం తో పని చేస్తుందని ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కే గౌతమ్ కుమార్లు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి తమపై పట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని నూతన రెవెన్యూ చట్టం ప్రకారం ఇంకా మెరుగైన సేవలు అందిస్తామని ప్రకటించారు. ట్రెసా విజ్ఞప్తి మేరకు వీఆర్ఏ లకు పూర్తి వేతనంతో పాటు వారసత్వ ఉద్యోగాలు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.

*ప్రజా సంకల్పం & link Media ద్వారా ట్రెసా ప్రతినిధులను అడుగుతున్నాను మీ అధికారులు లంచాలు తీసుకుంటూ ACB అధికారులకు పట్టుబడి దేశం మొత్తంలో చర్చ జరిగినా మీరు ఎందుకు స్పందించలేదు ??.. రైతులు మీ అధికారుల నిర్లక్ష్యంతో ఆత్మహత్యలకు పాల్పడినప్పుడు స్పందించలేదు ??  ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని పొగడడానికి ముందుకు వచ్చారా ??  ఇదెక్కడి న్యాయం?? మారాలి ట్రెసా ప్రతినిధులారా మారాలి మీరు*

*Copy to Group link Media*

బాపట్ల కృష్ణమోహన్

https://prajasankalpam1.blogspot.com/ 

No comments:

Post a Comment