Sunday, September 6, 2020

తెలంగాణ రెవిన్యూ వ్యవస్థ లో మార్పులు

హైదరాబాద్ : 07/09/2020

*తెలంగాణలో  వీఆర్వో వ్యవస్థ రద్దు....? కలెక్టర్లకు ఆదేశాలు*
తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని సీఎం కేసీఆర్ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు... ముఖ్యంగా *ఈ శాఖలో భారీ స్థాయిలో లంచాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి...* తాజాగా కొందరు *అధికారులు కోట్ల రూపాయాల్లో లంచాలు తీసుకుంటూ పట్టుబట్టడం చర్చగా మారింది.* ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. *వీఆర్వో వ్యవస్థ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది కేసీఆర్ సర్కార్...* వీఆర్వోల నుంచి రికార్డులన్నీ స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్‌లకు సీఎస్‌ ఆదేశాలు జారీ చేశారు... మధ్యాహ్నం 3 గంటలకల్లా రికార్డులు స్వాధీనం చేసుకుని.. సాయంత్రం 5 గంటల కల్లా రిపోర్ట్‌ పంపాలని కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి.
వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డులు స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వ ఆదేశాలు వెళ్లాయి.. *ఇప్పటికే తహశీల్దార్ల నుంచి వీఆర్వో లందరికి ఆదేశాలు అందినట్టు రెవెన్యూ ఉద్యోగుల సంఘం నేతలు చెబుతున్నారు..* అయితే, దీనిపై మాకు చాలా అనుమానాలు ఉన్నాయి.. మా అనుమానాలను ప్రభుత్వం నివృత్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు రెవెన్యూ ఉద్యోగుల సంఘం నేతలు.. మా సర్వీస్ పరిస్థితి ఏంటి? మేం ఏ శాఖలో ఉద్యోగులం అవుతామో చెప్పాలి అని ప్రశ్నిస్తున్నారు.

*తెలంగాణ ప్రియమైన ముఖ్యమంత్రి గారు *ప్రజా సంకల్పం & link మీడియా ద్వారా మిమ్మల్ని కోరేది ఒక్కటే లంచాలు తీసుకుంటున్న రెవిన్యూ అధికారులను సిబ్బందిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తీసివేయాలి*

సుజీవన్ వావిలాల🖋️
ప్రజల పక్షం

బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం

*Copy to Group link Media*

https://prajasankalpam1.blogspot.com/ 

No comments:

Post a Comment