Thursday, September 10, 2020

తెలంగాణ పాలీసెట్ ఫలితాలు విడుదల

హైదరాబాద్ : 11/09/2020

*పాలిసెట్‌ ఫలితాల్లో బాలికలదే పైచేయి*
  
*ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌లో ఆధిపత్యం*
రేపటి నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ షురూ
తెలంగాణ రాష్ట్ర పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (టీఎస్‌ పాలిసెట్‌) ఫలితాల్లో *బాలికలు సత్తా చాటారు*. ఈ నెల రెండున నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను సెట్‌ కన్వీనర్‌, సాంకేతిక విద్యాకమిషనర్‌ నవీన్‌మిట్టల్‌ గురువారం విడుదలచేశారు. పాలిటెక్నిక్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో 81.14% ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో *బాలికల శాతం 84.93 ఉండగా.. బాలురు 78.72 శాతం ఉన్నారు*. మొత్తం 73,920 మంది దరఖాస్తుచేసుకోగా.. 56,945 మంది పరీక్షలకు హాజరయ్యారు. 46,207 మంది అర్హత సాధించారు. అగ్రికల్చర్‌ విభాగంలో 46,318 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఇక్కడ కూడా బాలికలే సత్తా చాటారు. బాలురు 78.40 శాతం, బాలికలు 85.93 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 120 మార్కుల్లో జనరల్‌ విద్యార్థులకు (క్వాలిఫైయింగ్‌) 30% మార్కులు, ఎస్సీ, ఎస్టీలకు ఒకశాతం మార్కులను కటాఫ్‌గా నిర్ణయించారు. 30% మార్కులు సాధించిన జనరల్‌ అభ్యర్థులకు, ఒక్కశాతం మార్కులు సాధించిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ర్యాంకులు కేటాయించారు. ఇందులో ఎస్సీ విద్యార్థులు 9,510 మంది పరీక్షలకు హాజరుకాగా.. 9,508 మంది ర్యాంకులు సాధించారు. పరీక్షకు హాజరైన 4,715 మంది ఎస్టీ విద్యార్థులు ర్యాంకులు సాధించారు. విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ విభాగాల్లో వేర్వేరుగా ర్యాంకులు ప్రకటించారు. ఫలితాలను https:// polycetts.nic.in,  www.sbtet .telangana.gov.in, www.dtets.cgg. gov.in వెబ్‌సైట్లలో పొందుపరిచారు. శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహణకు ఇప్పటికే షెడ్యూల్‌ జారీచేశారు.

@నమస్తే తెలంగాణ మీడియా

బాపట్ల కృష్ణమోహన్

https://prajasankalpam1.blogspot.com/ 

No comments:

Post a Comment