Friday, September 4, 2020

తెలంగాణ రెవిన్యూ శాఖ లో మరో లంచగొండి అధికారి

హైదరాబాద్ : 04/09/2020

*సిగ్గులేని రెవిన్యూ అధికారి, ఎక్కడికి పోయారో రెవిన్యూ సంఘాల నాయకులు ??? **

*లంచం తీసుకుంటూ చిక్కిన ఎమ్మార్వో*

రెవెన్యూ శాఖలో అవినీతి బాగోతం కొనసాగుతూనే ఉంది. కీసర తహసీల్దార్‌ కోటి రూపాయల లంచం వ్యవహారం ముగివకముందే మరో అవినీతి బాగోతం బయటపడింది. *ఓ రైతు నుంచి లక్షా 50 వేల రూపాయలు లంచం డిమాండ్ చేస్తూ నాగర్ కర్నూల్ జిల్లా లింగాల తహసీల్దార్ మళ్లిఖార్జున్ అడ్డంగా దొరికిపోయాడు*. అయితే ఎమ్మార్వో మొత్తంలో డిమాండ్‌ చేయగా.. రైతు తరువాత ఇస్తానని ఒప్పుకోవడంతో తొలుత *అడ్వాన్స్‌గా 50 వేలు తీసుకున్నాడు*. అదే పనికి మరో రైతు నుంచి అదనపు డబ్బులకు కక్కుర్తిపడ్డాడు. పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని ఇతరులకు పట్టా పంపిణీ చేశాడు. దీంతో *తిరగబడ్డ రైతులంతా* శుక్రవారం తహసీల్దార్ తీరు నిరశిస్తూ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు.
ఈ విషయం కాస్తా పెద్దది కావడంతో వివాదం నుంచి ఎమ్మార్వో తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే తొలుత 50 తీసుకున్న రైతుకు 40 వేలు తిరిగి ముట్టజెప్పాడు. మిగతా పదివేలు కూడా ఇవ్వాలని పట్టుబట్టగా ఖర్చయ్యాయంటూ పారిపోయేందుకు యత్నించాడు. దీంతో ఎమ్మార్వో కారుకు రైతులు అడ్డుపడ్డారు. అయినప్పటికీ రైతులను తోసుకుంటు వెళ్లిపోయారు. 

సుజీవన్ వావిలాల
ప్రజల పక్షం

బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/ 

No comments:

Post a Comment