Monday, September 7, 2020

తెలంగాణ -కోవిద్ 19

హైదరాబాద్ : 08/09/2020

*తెలంగాణ లో కొత్తగా 2, 392 కరోనా కేసులు*

తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 60,923 కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 2,392 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,45,163కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 11మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 906కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 2,346 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,12,587కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 31,670కి చేరిందని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 18,27,905కి చేరింది.

సుజీవన్ వావిలాల🖋️
ప్రజల పక్షం

బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/ 

No comments:

Post a Comment