Wednesday, September 23, 2020

తెలంగాణ పాలిటెక్నిక్ సీట్ల కేటాయింపు

హైదరాబాద్ : 23/09/2020

*పాలిటెక్నిక్ మొదటి విడత సీట్లు కేటాయింపు*
తెలంగాణ పాలిటెక్నిక్‌ మొదటి విడత సీట్లు కేటాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 71.14 శాతం సీట్లు మొదటి విడతలో భర్తీచేశారు. మరో 8,948 సీట్లు మిగిలినట్లు సాంకేతిక విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ ఏడాది పాలీసెట్‌లో 45,207 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 27,759 మంది మాత్రమే వెబ్‌ఆప్షన్లు ఇచ్చారు.
విద్యార్థులు సీటు కేటాయింపు ఉత్తర్వులను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ సూచించారు. ఈనెల 26 వరకు ఆన్‌లైన్‌లోనే బోధనా రుసుము చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలన్నారు. అక్టోబరు 5, 6 తేదీల్లో కళాశాలలకు వెళ్లి చేరాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
అక్టోబరు 7న విద్యా సంవత్సరం ప్రారంభించి 14 వరకు ఓరియెంటేషన్ నిర్వహిస్తామన్నారు. అక్టోబరు 15 నుంచి తరగతులు ప్రారంభించనున్నట్లు నవీన్ మిత్తల్ తెలిపారు.

సుజీవన్ వావిలాల
ప్రజల పక్షం

బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/ 

No comments:

Post a Comment