Courtesy by : Q Group Media (తీన్మార్ మల్లన్న)
తెగిన బంధం - ఆపరేషన్ కమలం ఆట....మైహోం, కేసీఆర్ లడాయి
మధ్యలో చిన్నజీయర్
ఆపరేషన్ కమలం ఆట
మోడీ దెబ్బకు కేసీఆర్ విలవిల
ప్రెస్ మీట్ తో బట్టబయలు
త్వరలో మై హోంకు రాజ్యసభ
బ్యాక్ స్టెప్ లో ప్రశాంత్ కిషోర్
శనార్తి తెలంగాణ: ఒక్క టూర్ తో తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టారు మోడీ షాల జోడి.. ముచ్చింతల్ సమతామూర్తి ఓపెనింగ్ టూర్ తో కేసీఆర్ మైహోంల బంధం దాదాపుగా తెగిపోయింది.. ఇన్నిరోజులు ఆధ్యాత్మిక ఆత్మియుడిగా ఉన్న చిన్నజీయర్ సైతం కేసీఆర్ తో కయ్యానికి దిగిపోయాడు.. కేసీఆర్ కు పవర్ ఫుల్ సెంటర్లుగా ఉన్న మై హోం.. చిన్నజీయర్లు దూరం కావడంతో కేసీఆర్ ప్రతిక్షణం ఆందోళన పడుతున్నట్టు తెలుస్తుంది.. కేసీఆర్ కు సంపదను కొల్లగొట్టడం తెలిస్తే.. ఆ కొల్లగొట్టిన సంపద ఏ రూంలో దాచారో ఆ రూంకు తాళం వేయడం మోడీషాలకు తెలిసిన జిమ్మిక్కు..
ఇంతకీ ఏమైంది..?
సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు మోడీని.. వేడుకలకు రావలసిందిగా అమీత్ షాను ఆహ్వానించారు మైహోం రామేశ్వర్ రావు, చిన్నజీయర్ ఉమ్మడిగా.. ఈ కార్యక్రమానికి ఓకే చెప్పిన మోడీషా ఉద్దండులు వేడుకను సరిగ్గా వాడేసుకున్నారు.. సమతామూర్తి ఓపెనింగ్ శిలాఫలకంపై కేసీఆర్ పేరు ఉండొద్దు అని అమీత్ షా చేసిన సూచనను కాదనలేకపోయిన జీయర్.. మోడీ మరియు తన పేరుతో సరిపెట్టాడు.. అప్పటివరకు విగ్రహ ఏర్పాట్లు మంచి చెడూ చూస్తూ వచ్చిన కేసీఆర్ కు కోపం తెప్పించింది.. ఆక్షణం నుండి ముచ్చింతల్ కు వెళ్లడం బందు పెట్టాడు కేసీఆర్.. ఒక్క ప్లాన్ తో మై హోం, జీయర్ లకు కేసీఆర్ ను దూరం చేశాడు.. విషయం తెలిసిన వెంటనే బడ్జెట్ పేరుతో ప్రెస్ మీట్ పెట్టినా అసలు విషయం మాత్రం ఈ వ్యవహారమే అనేది కొందరికి మాత్రమే తెలుసు.. తన అధికార పీఠానికి మూల స్థంభాలుగా భావించిన జీయర్, మై హోంలను కేసీఆర్ కు దూరం చేశారు.. యాదాద్రి ఆయల నిర్మాణం.. పేరు మార్పు దగ్గరి నుండి పర్యవేక్షించిన జీయర్ ను ఏకంగా యాదాద్రి ఓపెనింగ్ కే పిలవకుండా దూరం పెట్టేశాడు.. ఇదే అంశంపై జీయర్ ను విలేకరులు ప్రశ్నించగా దూరం ఉండేవాళ్ల ఖర్మ అంటూ కుండబద్దలు కొట్టాడు..
మోడీ దెబ్బకు కేసీఆర్ విలవిల
తెలంగాణ రాష్ట్రంలో పాగావేయాలని తహతహగా ఉన్న బీజేపీ ఆటను ఎప్పుడో మొదలు పెట్టింది.. కేసీఆర్ ప్రధాన వనరులపై దృష్టి పెట్టి ఆట ప్రారంభించింది.. కేసీఆర్ శక్తులు ఎక్కడున్నాయో కనుక్కోని మరీ వేట ప్రారంభించింది.. కేసీఆర్ బినామీ ఆస్తులపై ఓవైపు ఐటీ సోదాలు జరుగుతుండగా ఆప్తుల మధ్య గ్యాప్ పెంచింది.. దేశంలో మోడీషాల జోడీని ఎదుర్కోని వాళ్ల వ్యూహాలను కనిపెట్టడంలో కేసీఆర్ ఇంకా మెర్చ్యూర్ కాలేదు.. తెలంగాణ రాష్ట్రంలో బలంగా ఉన్న కాంగ్రెస్ ను డీలా చేసి బీజేపీని డెవలప్ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి మళ్లీ గట్టెక్కుతాననుకున్న కేసీఆర్ వ్యూహానికి ఈ రకంగా చెక్ పెట్టారు మోడీషా.. కేసీఆర్ నమ్మకున్నవారిని ఒక్కొక్కరిని బుట్టలో వేసుకుంటూ వస్తున్నారు..
త్వరలో మైహోం రాజ్యసభకు
మైహోం చేత టీవీ9 గ్రూప్.. ఎన్టీవీ, టెన్ టీవీ ఛానెళ్లను కొనిపిచ్చిన కేసీఆర్ వాటి ద్వారా కేంద్రంలో చక్రం తిప్పాలని కళకన్నాడు.. కానీ ఈ విషయాన్ని ముందే పసిగట్టిన కేంద్రం మాయల ఫకీరు ప్రాణాలు చిలుకలో ఉన్నట్టు.. కేసీఆర్ ప్రాణాలు మై హోంలో ఉన్న విషయం గమనించి మై హోంకు బీజేపీ తీర్థం తాగించే పని మొదలు పెట్టారని తెలిసింది.. ఇందుకోసం మై హోంకు రాజ్యసభ సీటు ఆఫర్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.. ఇక మై హోం కూడా రాజ్యసభ వ్యవహారాన్ని చూడాల్సిందిగా.. టీవీ9 భరత్ వర్ష్ డైరెక్టర్ గా పనిచేస్తున్న హేమంత్ శర్మకు అప్పగించినట్టు సమాచారం.. ఇప్పటికే బీజేపీ అగ్రనేతలనే భేటీ అయిన హేమంత్ శర్మ.. సీటు కన్ఫర్మేషన్ విషయాన్ని మై హోంకు చెప్పినట్టు అత్యంత కీలక సమాచారం..
ఏకు మేకైంది
ఏలు పెట్టె సందిస్తే కాలు పెట్టే బ్యాచ్ మోడీ, అమీత్ షాది అలాంటి వారిని కూడా ఫూల్స్ ను చేయాలని ప్రయత్నించిన కేసీఆర్ బొక్కబోర్లా పడ్డాడు.. రాష్ట్రంలో అధికారంనేను తీసుకుంట కేంద్రంలో మీకు సహకరిస్తా అనే సూత్రాలు ఇంటర్నల్ మీటింగ్ లో చెప్తూ వస్తున్న కేసీఆర్ కు పూర్తిగా చదివేశారు మోడీ షాలు.. వలలో చిక్కేవరకు రానిచ్చారు.. అక్వేరియంలో పెంచుతారని ఆశపడ్డ కేసీఆర్ కు.. అది కర్రీకి సిద్దమైన సంగతి ఇటీవలే బోధపడింది.. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అండ్ టీఆర్ఎస్ కంపెనీకి చెక్ పెట్టి కుర్చింది బీజేపీ..
చేతులెత్తేశిన ప్రశాంత్ కిషోర్
ఎలాగైనా గట్టెక్కిస్తాడనుకున్న ప్రశాంత్ కిషోర్ సైతం మోడీ షాల దెబ్బకు గిలగిల కొట్టుకుంటున్నాడు.. ఓ వైపు ఉద్యోగాల భర్తీ , అభివృద్ధి పనుల డ్రామాకు తెరలేపినా.. మోడీ షాలు మొదళ్ల నుండి నరుక్కుంటూ వస్తుండడంతో ప్రశాంత్ కిషోర్ సైతం చేతులెత్తేశినట్టు తెలుస్తుంది.. కేంద్రం సహకరిస్తుంది.. నిలువరించాల్సింది కాంగ్రెస్ నే అంటూ ఇన్నాళ్లు పీకేకు చెప్పుకుంటూ వచ్చిన కేసీఆర్.. తీరా బీజేపీ ఫ్లెట్ ఫిరాయించడంతో పీకే కూడా కేసీఆర్ కు హ్యాండ్ ఇచ్చినట్టు తెలుస్తుంది.. ఇటీవల ఒక నేషనల్ మీడియా ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన పీకే టీఆర్ఎస్ అసైన్ మెంట్ కు సంబంధించి ఇంకా కుదరలేదన్న వ్యాఖ్యలు చేశారు.. మొత్తానికి మోడీ, షా సైలెంట్ గా వాయ్ లెంట్ స్టార్ట్ చేశారు.. ఇది జనానికంటే ముందు.. కేసీఆర్ అండ్ కంపెనీకి అర్థమైంది గంతే.. జనానికి తెలియడానికి మరికొన్నిరోజులు సమయం పట్టే అవకాశం ఉంది.

No comments:
Post a Comment