Thursday, March 3, 2022

నోరు తెరిస్తే..గొంతు నొక్కేస్తాం? విచిత్రంగా తెలంగాణ పోలీస్ పాలసీ

నోరు తెరిస్తే..గొంతు నొక్కేస్తాం? విచిత్రంగా తెలంగాణ పోలీస్ పాలసీ

Courtesy by : తొలివెలుగు మీడియా website

ప్రశ్నిస్తే కిడ్నాప్ లు చేయడం తెలంగాణ పోలీసులకు అలవాటుగా మారింది.చట్టాలను తమ చుట్టాలుగా మార్చుకుని పౌరులను మానసిక వ్యధకు గురిచేసి విచక్షణ రహితంగా వ్యవహారిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన మీడియా పోలీసులు ఇచ్చే సమాచారాన్నిమాత్రమే తీసుకోని కథలు కథలుగా గ్రాఫిక్స్ ప్లేట్స్ తో నడిపేస్తున్నారు.ఏది చూపించినా చూస్తారని భావనతో నిందితుల కుటుంబాల వెర్షన్ వినడం లేదు.పోలీసుల తీరు ఎలా ఉంటుందో ఇటీవల సంచలనం సృష్టించిన జై భీం సినిమాలోనే కనిపించింది.ఆ సీన్ అదివాసి గిరిజన కుటుంబాల్లో జరిగితే.. అలాంటి సీనే కాంక్రీట్ జంగల్ అయిన హైదరాబాద్ లో చోటు చేసుకుంటోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే తొలివెలుగు నిందితుల తరుపున అసలు ఏం జరిగింది. పోలీసుల వేధింపులు ఏంటి.? తనదైన శైలిలో పోలీసులు ఒప్పించారా అనే అనుమానాలను తెరపైకి తెస్తోంది. పోలీసుల తప్పిదాలు ఏంటీ..? అసలు జరిగింది ఏంటో మీ ముందు ఉంచే ప్రయత్నం చేయబోతోంది తొలివెలుగు క్రైం బ్యూరో.

మంత్రి హత్య కుట్ర కేసు వెనక ఎన్నో అనుమానాలు..?.

1. మంత్రి హత్యకు కుట్ర పన్నారని ఫరూక్ అనే క్రిమినల్ చెప్పిన మాటలు నమ్మి పోలీసులు కేసును దర్యాప్తు చేశారు. రాఘవేంద్ర రాజు అలియాస్ రఘు తనను డిసెంబర్ 18న కలిశాడని ఇదే పోలీసులకు కన్ఫెషన్ రిపోర్ట్ లో తెలిపాడట. తీరా ఆ రోజు శనివారం కోర్టు కేసులు లేకపోవడమే కాకుండా..శంషాబాద్ పోలీసుల అదుపులోనే ఉన్నాడట. తొలివెలుగు ప్రశ్నకు డిసెంబర్ కాదు నవంబర్ 18 అని చెప్పిన సీ.పి.ఆ తర్వాత పోలీసులకు ఓ మర్డర్ అటెంప్ట్ కేసులో పట్టుపడ్డారు అన్నారు. మరి అప్పుడు ఎందుకు ఈ విషయం బయటపెట్టలేదనేది కీలక ప్రశ్న. ముస్తఫా తో పాటు.. మరొకరి హత్యకు కుట్ర పన్నేందుకు ఓ వ్యక్తి కలిశారనే విషయాన్నిఎందుకు రాబట్టలేకపోయారు. పీడీ యాక్ట్ కింద ఏడాది జైల్లో ఉండి..అత్యంత క్రిమినల్ మెంటాల్టితో హత్యలు చేసే ఫరూక్ ఇచ్చిన విషయాన్ని నమ్మి సైబరాబాద్ పోలీసులు మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య ఫై కుట్రలు అని హడావుడి చేస్తున్నారు.ఈ విషయం శ్రీనివాస్ గౌడ్ కి తెలియదట..పోలీసులే చెప్పారట..? గతంలో శ్రీనివాస్ గౌడ్ తనను చంపించేందుకు కుట్రలు చేస్తున్నాడు.కేసులు వాపసు తీసుకోవాలని బెదిరిస్తున్నారని బాధితులు కంప్లైంట్ చేస్తే కనీసం ఫిర్యాదు స్వీకరించలేదు.

2.. మూడు నెలల వరకు విషయం ఎవ్వరికి చెప్పని ఫరూక్.. ఈ నెల 25న తనతో పాటు తన మిత్రుడైన హైదర్ ఆలీ పై దాడికి యత్నం చేశారని ఫిర్యాదు చేశారు. నగరంలో అన్ని చోట్ల సీ.సీ. ఫుటేజ్ ఉంది . మరి ఇంత వరకు ఎందుకు బయట పెట్టలేదు. తుపాకులు వారి వద్దనే ఉన్నాయని చెప్పిన పోలీసులు. మళ్లీ తుపాకుల కోసం ఫరూఖ్ ని ఎందుకు సంప్రదిస్తారు.

3.శ్రీనివాస్ ,విష్ణు తాము సి.ఎం.వో నుంచి అంటూ వచ్చి వివరాలు సేకరించారు.వానువనె పోలీసులు గుర్తించారా..?23 ఉదయం 11 గంటలకు రఘు తమ్ముడు నాగరాజు కిడ్నాప్ అయ్యాడు. పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు అతని భార్య.ఇది పోలీసుల కిడ్నాపే అని అనుమానం వ్యక్తం చేశారు. ఇదే రోజున రాఘవేంద్ర రాజు ఇంటి పై సివిల్ డ్రెస్ లో పోలీసులు దాడులు చేశారు.తలుపులు పగలకొట్టారు. అంతా సీసీ ఫుటేజ్ లో ఉంది. ఇదే రోజు హైదరాబాద్ సుచిత్రలో ఫరూక్ ,హైదర్ ఎస్విఎం లో రూమ్స్ తీసుకోని రక్షణ పొందుతున్నారని పోలీసులు చెప్పారు. అందుకు కిడ్నాప్ కి గురయిన వ్యక్తులు 25న వచ్చి దాడి చేస్తారా..?

4.ఇక ముగ్గురిని రిమాండ్ తరలించారు. రాఘవేంద్ర తో ఎవరెవరు ఉన్నారో వారందరి పై మంత్రి పై హత్యకు కుట్రపన్నారని నిందితులుగా చేర్చారు. అయితే 15 కోట్లు ఇచ్చే స్తోమత వీరికి లేదు. అదే బిజేపి వారు ఇచ్చారని అనుకుంటే.. ఫరూక్ పై ఎందుకు దాడికి ప్రయత్నిస్తారు. నేరుగా శ్రీనివాస్ గౌడ్ పై దాడి చేసి జైలుకు వెళ్లేవారు కదాని కుటుంబ సభ్యులే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఈ కుట్ర పై సి.బి.ఐ దర్యాప్తు జరిగితే పోలీసుల కట్టు కథలు. శ్రీనివాస్ గౌడ్ మాస్టర్ ప్లాన్ తెలుస్తుందన్నారు.

5.ఇక ఏ ఇతర రాష్ట్రాల్లో నిందితులను పట్టుకున్నా.. అక్కడ పోలీసులకు సమాచారం ఇవ్వాలి.24 గంటలు దాటి ప్రయాణం చేయాల్సి ఉంటే..అక్కడి కోర్టులో హాజరు పరిచి ట్రాన్సిట్ వారెంట్ పై తీసుకోని రావాలి. కానీ కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన తీరు సీసీకెమెరాల్లో కనిపించింది. ఢిల్లీలో విఐపీ జోన్ లో సర్చ్ వారెంట్ లేకుండా వెళ్లకూడదు.క్రిమినల్ కంటే ఎక్కవగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. చట్టాలను ఫాలో కాని ఈ పోలీసుల పై చర్యలు ఎందుకు తీసుకోలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

6.ఇన్నికుట్రలు చేసిన పోలీసులు..సీఆర్పీసీ 160 స్టేట్ మెంట్ లో ఏ1 రాఘవేంద్ర రాజు .. పోలీసులు ముందు ఒప్పుకున్నాడా..; ఒప్పుకునేలా చేశారా..అనేది పెద్ద అనుమానం. ?

7.2012లో ఆధార్ ఎన్ రోల్ వస్తే 3 కోట్లు సంపాదించిన వారు. ఆ తర్వాత శ్రీనివాస్ గౌడ్ అడ్డుకున్నాడని కక్ష పెంచుకున్నారని .. మొత్తం 30 కేసులు అక్రమంగా బనాయించారని రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పేర్కొన్నారు. ఒకే రోజు 13 ఎక్సైజ్ కేసులు పెట్టారని కూడా నిందితుడు తెలిపాడట. అయితే ఇన్ని కేసులు పెట్టడానికి కారణం .శ్రీనివాస్ గౌడ్ అక్రమాలను బయటకు తీస్తున్నాడని..ఆ సమాచారాన్ని మీడియా కు అప్పగిస్తున్నారని ..ఢిల్లీ హైకోర్టులో కేసు ఓడిపోయినా..మళ్లీ సుప్రీం కోర్టుకి అప్పిల్ వెళ్లడం జీర్ణించుకోలేకనే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణలు వస్తున్నాయి.


No comments:

Post a Comment