Thursday, March 10, 2022

కులమతాల పేరుతో పంచాయతీ పెట్టే చిల్లర రాజకీయాలు చేయం.... KTR

*కులమతాల పేరుతో పంచాయతీ పెట్టే చిల్లర రాజకీయాలు చేయం.... KTR!*

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ఒకవైపు అభివృద్ధి.. మరోవైపు సంక్షేమంతో ముందుకు సాగుతున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. నేడు ఉప్పల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ క్రమంలోనే అర్హులు ఎవరికైతే పెన్షన్లు రాలేదో వారికి వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లు కూడా వస్తాయని తెలిపారు. లక్ష ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టి 70 వేల ఇళ్లను సిటీలో కట్టామన్నారు. ఐటీ అంటే ఒక్క మాదాపూర్ కాకుండా ఉప్పల్ నియోజకవర్గంలో కూడా కంపెనీలు వచ్చాయని కేటీఆర్ తెలిపారు.

కులాలు, మతాల పేరుతో పంచాయతీ పెట్టే చిల్లర రాజకీయం మనది కాదన్నారు. సీఎం కేసీఆర్ చెప్పిన ఉద్యోగాలను నమ్మబోమని వేరే పార్టీ ఎమ్మెల్యేలు అన్నారని.. కేసీఆర్ మాట నమ్మితే ఇక్కడ దరఖాస్తు పెట్టుకోవాలన్నారు. నమ్మనివారు ప్రధాని మోదీ చెప్పిన రెండు కోట్ల పకోడీ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని కేటీఆర్ చెప్పారు.

link Media ప్రజల పక్షం🖋️ 

No comments:

Post a Comment