Sunday, March 27, 2022

టాప్ 15లో మూడు భారత నగరాలు

టాప్ 15లో మూడు భారత నగరాలు

Courtesy by : తొలివెలుగు మీడియా website

శబ్ధ కాలుష్యం పరంగా పలు నగరాలకు ర్యాంకులు కేటాయిస్తూ ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం తాజాగా ఒక నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం…

ప్రపంచంలోనే అత్యంత ధ్వని కాలుష్యం గల నగరంగా బంగ్లాదేశ్ రాజధాని ఢాకా(119 డెసిబెల్స్) నిలిచింది. ఆ తర్వాత స్థానంలో యూపీకి చెందిన మొరాదాబాద్ (114 డెసిబెల్స్) ఉంది.

ఇక మూడో స్థానంలో పాకిస్తా్న్ రాజధాని ఇస్లామాబాద్ (105 డెసిబెల్స్) ఉన్నట్టు నివేదిక పేర్కొంది. ఇక టాప్ మూడు స్థానాల్లో దక్షిణ ఆసియా నుంచి ఉండటం గమనార్హం.

ఇక ప్రపంచంలోనే అత్యంత ధ్వని కాలుష్యం గల టాప్ 61 నగరాల జాబితాలో భారత నగరాలు ఢిల్లీ(83), కోల్ కతా(89), అసన్ సోల్ (89), జైపూర్(84) లు ఉన్నాయి.

ప్రపంచంలోనే అత్యంత శబ్ద కాలుష్యం గల 15 నగరాల్లో భారత్ కు చెందిన మూడు నగరాలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. జోర్డాన్ దేశానికి చెందిన ఐర్బిడ్ (60 డెసిబెల్స్), ఫ్రాన్స్ లియాన్(69 డెసిబెల్స్), స్విడన్ రాజధాని స్టాక్ హోమ్(70) అతి తక్కువ శబ్ధ కాలుష్యం గల నగరాలుగా నిలిచాయి.

No comments:

Post a Comment