Sunday, March 27, 2022

సుప్రీం మెట్లెక్కిన ఉక్రెయిన్ విద్యార్థులు

సుప్రీం మెట్లెక్కిన ఉక్రెయిన్ విద్యార్థులు

Courtesy by : తొలివెలుగు మీడియా website

రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను స్వదేశానికి రప్పించేందుకు ఇటీవల కేంద్రం ఆపరేషన్ గంగా చేపట్టింది. అందులో భాగంగా ప్రత్యేక విమానాల ద్వారా వారిని ఇండియాకు తీసుకు వచ్చింది.

తాజాగా ఉక్రెయిన్ నుంచి వచ్చిన వైద్య విద్యార్థులు సుప్రీం కోర్టు మెట్లు ఎక్కారు. ఉక్రెయిన్ లో పరిస్థితులు ఇప్పుడు మరింత ఉద్రిక్తంగా ఉన్నాయని, వాటిని పరిగణనలోకి తీసుకుని తమకు ఇండియాలోనే చదువుకునే అవకాశం ఇవ్వాలంటూ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు.

ఈ మేరకు ఉక్రెయిన్ నుంచి వచ్చిన తెలంగాణ, ఏపీ, కేరళ రాష్ట్రాలకు చెందిన వైద్య విద్యార్థులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.భారత్ లోనే తమ విద్యను పూర్తి చేసేందుకు వీలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వాలని సుప్రీం కోర్టును వారు కోరారు.
ఉక్రెయిన్ పై రష్యా దాడులు 32 వ రోజుకు చేరుకున్నాయి. తాజాగా ఉక్రెయిన్ పశ్చిమ నగరమైన లైవీవ్ పై నగరంపై రష్యా ఆదివారం నాలుగు క్షిపణి దాడులు చేసింది.

No comments:

Post a Comment