Tuesday, March 8, 2022

కేసీఆర్ అసెంబ్లీ ప్రకటనపై కోమటిరెడ్డి హాట్ కామెంట్స్

కేసీఆర్ అసెంబ్లీ ప్రకటనపై కోమటిరెడ్డి హాట్ కామెంట్స్

Courtesy by : తొలివెలుగు మీడియా website

నిరుద్యోగులు బుధవారం ఉదయం 10 గంటలకు టీవీ చూడాలన్నీ కేసీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. ఆయన ఏం చెప్తారా? అని రాష్ట్రమంతా ఎదురుచూస్తోందన్న ఆయన.. ఇచ్చిన హామీలు మొత్తాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పాలన్నారు.

2018 ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగులకు రూ.3,116 భృతి ఇస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు కోమటిరెడ్డి. రాష్ట్రంలోని 40 లక్షల మంది నిరుద్యోగులు దీని కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. 37 నెలల నిరుద్యోగుల బకాయిలను కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.

ఇక ఖాళీగా ఉన్న 1.90 లక్షల ఉద్యోగాలకు ఒకే దఫాలో నోటిఫికేషన్ ఇస్తున్నట్లు కేసీఆర్ చెప్తారని భావిస్తున్నట్లు చెప్పారు కోమటిరెడ్డి. సమయానికి నోటిఫికేషన్లు రాక ఏజ్ లిమిట్ అయిపోయిన వారి కోసం కూడా మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు.

నిరుద్యోగుల ఆత్మహత్యలు చూస్తూనే ఉన్న కేసీఆర్.. తెలంగాణ రావడానికి యువకులు ముఖ్య కారణమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు కోమటిరెడ్డి. బుధవారం చేసే ప్రకటన ప్రధానంగా నిరుద్యోగ సమస్యలు తొలగిపోయేలా ఉంటుందని అనుకుంటున్నామన్నారు. తాము ఆశించినట్టు సీఎం ప్రకటన చేస్తే తానే కేసీఆర్ ఫొటోకు పాలాభిషేకం చేస్తానని చెప్పారు కోమటిరెడ్డి.


No comments:

Post a Comment