అంతర్జాతీయ మహిళా దినోత్సవం - మన కర్తవ్యం 
Courtesy by : నవతెలంగాణ మీడియా (ఎస్ వి రమ)
సుమారు వంద సంవత్సరాల క్రితం ఎనిమిది గంటల పని, సమాన వేతనం, ఓటు హక్కు మొదలైన డిమాండ్ల కోసం శ్రామిక మహిళలు పోరాటాలు చేశారు. దానికి గుర్తుగా మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏర్పడింది. ఆ పోరాట వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలి. కానీ అలాంటి చారిత్రాత్మక ఘటనలు సాధారణ వ్యవహారాలుగా మిగిలిపోతుండటం నేటి విషాదం. ఆ ఉద్యమాల చరిత్రను మరుగున పడేసి వాటి స్థానాల్లో వేడుకలను నిర్వహిస్తున్నారు. లాభాలను తెచ్చిపెట్టే మార్కెట్ ప్రేరేపిత ప్రాజెక్ట్‌లుగా మార్చివేస్తున్నారు. ఇలాంటి ఘటనల వెనుకవున్న చరిత్రను మరుగుపరుస్తున్నారు.
No comments:
Post a Comment