అమెరికాలో కేటీఆర్ పర్యటన.. ఆ సంస్థల ప్రతినిధులతో భేటీ
Courtesy by : తొలివెలుగు మీడియా website
https://twitter.com/MinisterKTR/status/1507612070535041033?t=iWz8_jvEwCNUk2-PJd-CqQ&s=19
తెలంగాణ రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ పనిచేస్తున్నారు. ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన ఐటీ రంగంలో అనేక మార్పులు తీసుకువచ్చారు. మల్టీ నేషనల్ కంపెనీలు హైదరాబాద్‌కు వచ్చేలా కృషి చేశారు.
ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ కోసం కొద్దిరోజులుగా తీరిక లేకుండా గడుపుతున్నారు.ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో సమావేశమైన ఆయన హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆయా కంపెనీలను కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బృందానికి వివిధ సంస్థల నుంచి అద్భుత స్పందన వస్తోంది.
శనివారం వరల్డ్ టాప్ ఫార్మా కంపెనీలతో కేటీఆర్ బృందం సమావేశమైంది. తెలంగాణలో ఫార్మా, లైఫ్ సైన్సెస్ సెక్టార్‌ను మరింత బలోపేతం చేసేలా ఫైజర్, జె అండ్ జె, జీఎఎస్‌కే వంటి దిగ్గజ కంపెనీలతో సమావేశమయ్యారు. ఈ సంస్థలు ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో భాగం కాగా.. వీటి వార్షిక ఆదాయం 170 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ మూడు కంపెనీల్లో 3 లక్షలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. అటువంటి దిగ్గజ కంపెనీలతో మంత్రి కేటీఆర్ సమావేశమై.. హైదరాబాద్ ఫార్మా గ్రోత్ స్టోరీలో భాగం కావాలని కోరారు.
హైదరాబాద్‌లో ఉన్న అవకాశాలను పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా కేటీఆర్ వారికి వివరించారు. హైదరాబాద్‌లో జీవఔషధ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా సహకారమందించాలని చేసిన విజ్ఞప్తికి కంపెనీల ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు.2023లో జరిగే బయో ఆసియా సదస్సులో పాల్గొనాలని కంపెనీ ప్రతినిధులను కేటీఆర్ ఆహ్వానించారు.
No comments:
Post a Comment