అధికారం లోకి వస్తే.... విద్య వైద్యం ఫ్రీ.......!*
*ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రెడీ.. 119 సీట్లలో అభ్యర్థులు సిద్ధం*
*హైదరాబాద్ ఎంపీ కైవసం చేసుకుంటాం*
*నేను సీఎం రేసులో లేను..*
*ఎవరు అవుతారో నాయకత్వం నిర్ణయిస్తుంది*
*కిషన్‌రెడ్డి, నా పేరు వస్తే ఆయన వైవే మొగ్గు చూపుతా*
*బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రెండేళ్లు పూర్తవుతున్న*
*సందర్భంగా..... బండి సంజయ్*
హైదరాబాద్: రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తే అర్హులైన వారందరికీ ఉచితంగా విద్య, వైద్యం అందిస్తామనే ప్రధాన ఎజెండాతో ముందుకు సాగు తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ప్రకటించారు. వచ్చే నెల 14 నుంచి చేపట్టే బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ప్రజ ల సమస్యలు, ఇతర అంశాలు తెలుసుకుని ఎన్నికల మేనిఫెస్టోకు తుది మెరుగులు దిద్దుతామన్నా రు. ఏ ఆశయాల సాధన కోసం తెలంగాణ ఏర్ప డిందో దానికి భిన్నంగా టీఆర్‌ఎస్ కుటుంబ, అవినీ తి, అప్రజాస్వామిక, నియంతృత్వ పాలన సాగుతోందని ప్రజల్లో తాము గట్టిగా ఎండగట్టగలిగామన్నారు. ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. మొత్తం 119 నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా కూడా సిద్ధమైందన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ఈ నెల 11తో రెండేళ్లు పూర్తవుతున్నందున శనివారంఅనేక అంశాలపై సంజయ్ స్పష్టతనిచ్చారు.
*మీరు సీఎం రేసులో ఉన్నారా?*
నేను సీఎం రేసులో లేను. బీజేపీలో సీఎం రేసులో ఉన్నవారెవరూ సీఎం కారు. మా పార్టీలో ముందుగా సీఎం అభ్యర్థిని ప్రకటించరు. గెలిచిన ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకు సీఎంను ప్రకటిస్తారు. జాతీయ పార్టీ అభిప్రాయం మేరకు తుది నిర్ణయం తీసుకుంటారు. బీజేపీ అధికారంలోకి వస్తే సామాన్య కార్యకర్త కూడా సీఎం అయ్యే అవకాశం ఉంది. ఎవరైనా పార్టీ గెలిచి అధికారంలోకి రావాలనే కోరుకోవాలి. ఇతరులను గెలిపించుకోవడంలో ప్రధాన పాత్ర పోషించాలి.
*మీ పేరు, కిషన్‌రెడ్డి పేర్లు వస్తే మీ మద్దతు ఎవరికి?*
మా ఇద్దరి పేర్లే పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తే నేనైతే కిషన్‌రెడ్డి వైపే మొగ్గుచూపుతాను. సీనియర్ నేత, పార్టీలో కష్టపడి పైకి వచ్చిన నాయకుడు. రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జిగా, మూడుసార్లు ఎమ్మెల్యేగా, ఒక సారి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు. ఐతే దీనిపై జాతీయ పార్టీ నాయకత్వమే నిర్ణయిస్తుంది.*హిందుత్వ ఎజెండాపై..*
హిందుత్వమే నా ఎజెండా. హిందూ ధర్మ రక్షణ కోసం ఎంతదాకైనా వెళ్తా. ఎంఐఎం కంచుకోటను బద్దలు కొడతాం. హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని ఈసారి కైవసం చేసుకుని బీజేపీ సత్తా చూపిస్తాం. అందుకే తొలి సదస్సు హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంపైనే నిర్వహిస్తున్నాం. ఎంఐఎంకు వత్తాసు పలుకుతున్న టీఆర్‌ఎస్ వెన్నులో వణుకు పుట్టిస్తాం.
*టీఆర్‌ఎస్‌ను ఎలా ఎదుర్కొంటారు?*
టీఆర్‌ఎస్ బెదిరింపులకు లొంగబోం. తిరగబడతామే తప్ప వెన్నుచూపే ప్రసక్తే లేదు. పార్టీని అధికారంలోకి తీసుకురావడమే నా లక్ష్యం. అందుకోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం. నాకు కుటుంబం కంటే పార్టీ ముఖ్యం. పార్టీ కంటే దేశం ముఖ్యం. సబ్బండ వర్గాల్లో కేసీఆర్ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది. టైమ్ వచ్చినప్పుడు సత్తా చూపేందుకు సిద్ధంగా ఉన్నారు. టీఆర్‌ఎస్ ఈసారి సింగిల్ డిజిట్‌కే పరిమితం కాబోతోంది. కేసీఆర్ చేయించుకున్న సర్వేలూ ఇదే చెబుతున్నాయి. అందుకే దేశ రాజకీయాలు, తెలంగాణ మోడల్ అంటూ కొత్త డ్రామాలు మొదలు పెట్టాడు.
*link Media ప్రజల పక్షం 🖋️
No comments:
Post a Comment