అఫి‘డౌట్స్’ ఎన్నో? కుట్ర పేరుతో కుతంత్రం! తొలివెలుగు ప్రత్యేక కథనం
--- శ్రీనివాస్ గౌడ్ హత్య ప్లాన్ కు.. అఫిడవిట్ కు సంబంధమేంటి?
– అఫిడవిట్ చుట్టూ ఉన్న కేసులే దీనికి కారణమా?
– ఇంతకీ.. మంత్రి అఫిడవిట్లలో ఉన్న లొసుగులేంటి..?
– 2014, 2018 అఫిడవిట్లలో ఉన్న తేడాలేంటి..?
– టాంపరింగ్ లో నిజమెంత..?
– తొలివెలుగు క్రైం బ్యూరో ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్..?
రెండు రోజులుగా మంత్రి హత్యకు కుట్ర కేసుపైనే రాష్ట్రమంతా చర్చ నడుస్తోంది. నిజంగా ప్లాన్ జరిగిందా? లేక.. ఇదంతా కావాలని చేసిన కుట్రనా? అనే ప్రశ్నల చుట్టూ తెరపైకి ఎన్నో అనుమానాలు వస్తున్నాయి. హైకోర్టులో కేసు వేసినందుకే గతంలో మంత్రి అక్రమ కేసులు బనాయించారనేది రాఘవేంద్రరాజు వెర్షన్. ఎన్నోసార్లు మీడియాకు ఈ విషయాన్ని ఆయన చెప్పారు కూడా. అందుకు ప్రతీకారంగా ఏకంగా మంత్రినే చంపేయాలనే ప్రణాళికను సిద్ధం చేశారనేది పోలీసుల వాదన. ఇదంతా ప్రాథమిక విచారణలో తేలిందని చెబుతున్నారు. అయితే.. ఒక్క కేసును దృష్టిలో పెట్టుకుని 30 కేసులు బనాయించడం వెనుక.. అసలు ఆ అఫిడవిట్స్ లో ఏముందో తొలివెలుగు క్రైంబ్యూరో తెలుసుకునే ప్రయత్నం చేసింది. కీలక సమాచారాన్ని దాచిపెట్టడం.. తప్పుడు సమాచారం ఇవ్వడం జరిగిందని తెలుస్తోంది. అయితే.. ఈ మాత్రానికే ఎమ్మెల్యే పదవికి, మంత్రి పదవికి ఏలాంటి డోకా ఉండదు.. కోర్టులో కేసుల విచారణ పూర్తయ్యే సరికి పదవీ కాలం ముగుస్తుంది. సో అంత భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు విశ్లేషకులు.
2014-2018 అఫిడవిట్స్ లో తేడాలు
2014 అఫిడవిట్ పై అనుమానాలు!
శ్రీనివాస్ గౌడ్ తన అస్తుల ప్రకటనలో బాగ్ లింగంపల్లిలో బ్లాక్ నెంబర్ 15 ప్లాట్ నెంబర్ 4ని ప్రకటించారు. అందులో వీ.వీణా భర్త శ్రీనివాస్ గౌడ్ అని ఉంది. అయితే ఈ వీణా ఏవరు..? అలాగే హౌస్ టాక్స్ లో కూడా అదే పేరు స్పష్టంగా కనిపిస్తుంది. పాన్ కార్డులో వీరసనవోళ్లు వీణా అని.. ఓటర్ కార్డులో మాత్రం వీ.శారద అని ఉంది.ఈ పేర్లు ఎలా మారాయని అనుమానాలు ఉన్నాయి. వివిధ ఆస్తుల టాక్స్ లు ఒక్క దగ్గర వీణా అని.. మరో వద్ద శారద అంటూ చెల్లిస్తున్నారు. ఆస్తులు మూడొంతులు పెరిగినట్లు అదాయపన్ను శాఖలో పేర్కొన్నారు.
2018లో జరిగింది ఏంటి?
మంత్రి శ్రీనివాస్ గౌడ్ నవంబర్ 13న నామినేషన్ దాఖలు చేశారు. రెండు సెట్ల అఫిడవిట్ ఇచ్చారు. అధికారులు వెరిఫికేషన్ చేసుకొని ఒక అఫిడవిట్ ని ఫైనల్ గా అప్రూవల్ చేసి 2018 నవంబర్ 14న అభ్యర్థనల కోసం వెబ్ సైట్ లో పెట్టారు. నామినేషన్ చివరి తేదీన అంటే 2018 నవంబర్ 19న 3 గంటలకు మరో అఫిడవిట్ దాఖలు చేసినట్లు అప్ లోడ్ చేశారు. చివరి అఫడవిటే వెబ్ సైట్ లో ఉంది. అయితే ఇందులో ప్రధానంగా తన భార్య పేరు మీద ఉన్న ఆస్తులను పూర్తిగా ప్రకటించలేదని తెలుస్తోంది. ఆస్తులను మార్టిగేష్ పెట్టిన విషయం తెలపలేదు. అలాగే ప్రభుత్వానికి పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలానాలు తెలియజేయలేదని ఆరోపణలు ఉన్నాయి. శ్రీనివాస్ గౌడ్ వాహనంపై ఆరోజు వరకు 35,515 రూపాయలు.. అతని భార్య వాహనంపై 10 వేల రూపాయల చలాన్స్ ఉన్నాయి. ఇవేమీ తెలియజేయలేదని ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు అందాయి. అయితే.. ఆర్డీవో వీటిపై ఆధారాలు లేవని పిటిషన్ ను రద్దు చేశారు. కుటుంబ సభ్యుల విషయాలను, వారి ఆస్తులను గొప్యంగా ఉంచినందున 19వ తేదీన అప్ లోడ్ జరిగింది. అయితే.. టాపరింగ్ చేసి పోలింగ్, రిజల్ట్ తేదీల మధ్యలో స్టేట్ ఎలక్షన్ కార్యాలయంలో మరో అఫిడవిట్ అప్ లోడ్ చేశారనేది ఫిర్యాదుదారుల ఆరోపణ. ఈ అంశంపైనే ఎలక్షన్ కమిషన్ కి కంప్లయింట్స్ వెళ్లాయి.
హైకోర్టులో ఏం జరుగుతోంది..?
తెలంగాణ హైకోర్టులో ముగ్గురు పిటిషన్లు దాఖలు చేశారు. టీడీపీ అభ్యర్థి చంద్రశేఖర్, రాఘవేంద్రరాజు, అలివేలు అనే మహిళ.. ఇవి బెంచ్ మీదికి రావడం లేదు. సుప్రీంకోర్టు పదే పదే ఎలక్షన్ పిటిషన్స్ ని త్వరగా విచారించాలన్నా కూడా తేల్చడం లేదు. అందుకే ఢిల్లీ హైకోర్టుకు వెళ్లాడు రాఘవేంద్రరాజు.. అక్కడ తమ పరిధి కాదని డిస్పోజ్ చేశారు. మళ్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అయితే.. మిగితా ఇద్దరు పిటిషనర్స్ సైలెంట్ గా ఉన్నా.. రాఘవేంద్ర రాజు మాత్రం.. ఎన్నికల కమిషన్ తో పాటు రాష్ట్రపతికి, సీజేఐకి, ప్రధాన మంత్రికి పదే పదే లేఖలు రాయడం, లోకాయుక్తతో పాటు అన్ని దర్యాప్తు సంస్థలకు శ్రీనివాస్ గౌడ్ అక్రమాలు అంటూ ఫిర్యాదులు చేయడంతో ఇద్దరి మధ్య వివాదాలు తారాస్థాయికి చేరినట్లు కనిపిస్తోంది.
అసలు ఏవేం దాచిపెట్టారంటే?
శ్రీనివాస్ గౌడ్ తన అఫిడవిట్లలో 62011824209 ఎస్బీఐ మాసబ్ ట్యాంక్ బ్రాంచ్ వివరాలు.. కారు లోన్ గురించి తెలియజేయలేదు. భార్య శారద పేరుతో ఉన్న మరో 52209878165 బ్యాంక్ అకౌంట్ ని తెలపలేదు. అలాగే భార్య పేరు మీద 2014లో కొనుగోలు చేసిన భూములను చూపించలేదు. మార్టిగేజ్ లోన్ విషయం దాచిపెట్టారు. నామినేషన్ తేదీ వరకు ప్రభుత్వానికి పెండింగ్ లో ఉన్న 45 వేల రూపాయల ట్రాఫిక్ చలానాలను చూపించలేదు. పెండింగ్ లో లేనట్లు పత్రిక ప్రకటన ఇచ్చింది ఎలక్షన్ కమిషన్. ఇవే కాకుండా శారదకు రెండు ఓటర్ ఐడీ కార్డులు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆస్తులు కొనుగోలు చేసిన సందర్బాల్లో తన తండ్రి పేరు కూడా వీ అనేలా ఇంటిపేరు పెట్టడంతో రాజకీయంగా దుమారం చెలరేగింది.
టాంపరింగ్ జరగలేదని చెప్పలేం?- ఐటీ నిఫుణులు
ఎన్నికల కమిషన్ కి లాగిన్స్ ఉంటాయి. ఫలితాలు వచ్చేంత వరకు వారి చేతిలోనే అభ్యర్థికి సంబంధించిన సమాచారం అంతా ఉంటుంది. ఆయా జిల్లా ఎన్నికల అధికారికి మాత్రమే పూర్తి పవర్ ఉంటుంది. కౌంటింగ్ పూర్తయిన తర్వాత మళ్లీ వెబ్ సైట్ ని తన కంట్రోల్ కి తీసుకుంటుంది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. అయితే.. శ్రీనివాస్ గౌడ్ అఫిడవిట్లలో ప్రపోజల్ చేసిన సంతకాలు, నోటరీ చేసిన అడ్వకేట్లు వేరువేరుగా ఉండటంతో ఈ పక్రియ అంతా పోలింగ్ తర్వాత నామినేషన్ చివరి తేదీన డేట్ వేసి అప్ లోడ్ మాత్రం రిజల్ట్ కి ఒక్క రోజు ముందు చేశారనే ఫిర్యాదులు రావడంతో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇంటర్నల్ దర్యాప్తు చేసింది. అందుకే ఆయనకు టెన్షన్ పట్టుకుందని చెబుతున్నారు. ఐటీ నిపుణులు మాత్రం అధికారులు తలుచుకుంటే అప్ లోడ్ చేసేందుకు అంత కష్టమైన పని ఏమీ కాదంటున్నారు.
No comments:
Post a Comment