Tuesday, March 1, 2022

ముంబాయి తర్వాత హైదరాబాదే......!

*ముంబాయి తర్వాత హైదరాబాదే......!*

*అత్యంత ధనికులు ఉన్న నగరాల్లో 2 వ స్థానం హైదరాబాద్.....!*

దే శంలో అత్యంత ధనికులు అధికంగా ఉన్న నగరాల్లో హైదరాబాద్‌ రెండో స్థానంలో ఉందని 'నైట్‌ ఫ్రాంక్‌ వెల్త్‌ రిపోర్ట్‌- 2022' వెల్లడించింది.ఈ నివేదిక ప్రకారం అత్యంత ధనికులను కలిగిన నగరాల్లో ముంబయి ప్రథమస్థానంలో ఉంది. 2021 ఏడాదిలో నికర ఆస్తి విలువ 30 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.227 కోట్లు) కంటే ఎక్కువగా ఉన్న వారిని 'అత్యంత ధనికులు'గా పరిగణనలోకి తీసుకున్నట్లు ఈ నివేదిక పేర్కొంది. వీరు ముంబయిలో 1,596 మంది ఉండగా, హైదరాబాద్‌లో 467 మంది ఉన్నారు. హైదరాబాద్‌లో అత్యంత ధనికుల సంఖ్య 2026 నాటికి 728 కి పెరుగుతుందని ఈ నివేదిక అంచనా వేసింది. గత అయిదేళ్లలో హైదరాబాద్‌లో అత్యంత ధనికుల సంఖ్య 314 నుంచి 48.7 శాతం పెరిగి, 467 కు చేరింంది. దేశవ్యాప్తంగా చూస్తే అత్యంత ధనికులు 2020లో 12,287 మంది ఉండగా, 2021లో ఆ సంఖ్య 13,637కు పెరిగింది. అంటే దాదాపు 11 శాతం వృద్ధి నమోదైంది. ఇక్కడి నుంచి 2026 నాటికి మనదేశంలో అత్యంత ధనికుల సంఖ్య 19,006 కు పెరిగే అవకాశం ఉందని నైట్‌ ఫ్రాంక్‌ నివేదిక అభిప్రాయపడింది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే 2020 లో 5.58 లక్షల మంది అత్యంత ధనికులు ఉండగా, 2021 నాటికి ఈ సంఖ్య 6.10 లక్షలకు పెరిగింది.

link Media ప్రజల పక్షం🖋️ 

No comments:

Post a Comment