*ఏసీబీ కీ చిక్కిన ట్రాన్స్ కో డీఈ!*
నల్లగొండ : రూ. రెండు లక్షలు లంచం తీసుకుంటూ ఓ ట్రాన్స్‌కో డీఈ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. మిర్యాలగూడలోని విద్యుత్ డీఈ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.ఈ దాడుల్లో డీఈ మురళీధర్ రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయారు. ఏసీబీ అధికారుల ప్రాథమిక సమాచారం ప్రకారం .. లైన్‌మెన్‌గా పనిచేస్తున్న గుంటూరు శ్రీనివాస్ తన సెలవుల క్రమబద్ధీకరణ చేయాలని డీఈ మురళీధర్ రెడ్డిని కోరారు.
అందుకు గాను డీఈ రూ.2.50 లక్షలు డిమాండ్ చేశారు. అంత డబ్బు ఇవ్వలేనని చెప్పినా డీఈ ససేమిరా అన్నారు. విసిగిపోయిన లైన్ మెన్ శ్రీనివాస్ నల్లగొండ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచనల మేరకు మంగళవారం రూ.2 లక్షలు తీసుకుంటుండగా డీఈ మురళీధర్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
అదేవిధంగా డీఈ మురళీధర్‌కు చెందిన హైదరాబాద్‌లో ఒక ఇల్లు, నల్లగొండలో రెండు ఇండ్లపై దాడులు చేసి వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఆపరేషన్ లో 40 మంది ఏసీబీ అధికారులు పాల్గొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
*link Media ప్రజల పక్షం🖋️* prajasankalpam1.blogspot.com
No comments:
Post a Comment