*బిజెపి గెలుపు లో మజ్లీస్ పాత్ర!*
*86 స్థానాల్లో మజ్లిస్‌కు గణనీయంగా ఓట్లు*
*లక్నో ......*
యూపీ ఎన్నికల్లో బీజేపీ రెం డోసారి గెలవడంలో మజ్లిస్ పార్టీ పాత్ర ఉందా?ఆ పార్టీ వల్లే ప్రతిపక్ష సమాజ్‌వాది పార్టీ ఆశలు గల్లంతయ్యాయా? యూపీలో మొత్తం 403 స్థానాలకుగాను బీజేపీ స్వయంగా 255 స్థానాల్లో, కూటమిగా 273 స్థానాల్లో గెలిచిన విషయం తెలిసిందే. సమాజ్‌వాది పార్టీ 111 సీట్లు, ఆర్‌ఎల్డీతో కలిసి 119 సీట్లే గెలిచింది. బీజేపీ కూటమి గెలిచిన సీట్లలో 86 మంది అభ్యర్థుల మెజారిటీ 2 వేల లోపే.
వీరిలో 49 మంది కేవలం 1000 ఓట్ల తేడాతో గెలవగా, 23 మంది 500 లోపు, ఏడుగురు 200లోపు ఓట్ల మెజారిటీ మాత్రమే సాధించారు. ఈ స్థానాల్లో పలు చోట్ల ఎంఐఎం అభ్యర్థులు బీజేపీకి వచ్చిన మెజారిటీ కన్నా ఎక్కువ ఓట్లు పొందారు. అవన్నీ ముస్లింల ఓట్లేనని, ఎంఐఎం బరి లో లేకపోతే ఆ ఓట్లు ఎస్పీ అభ్యర్థులకే దక్కేవని, తద్వారా ఎస్పీ కూటమి గెలుపొందేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి
link Media ప్రజల పక్షం🖋️
No comments:
Post a Comment